జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం మేజిక్ ఫిగర్‌తో సంబంధం లేకుండా ఎక్కువ మంది సభ్యులు ఎవరికి మద్దతు పలికితే వారే మేయర్, ఉపమేయర్‌గా ఎన్నికయినట్లని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుందని గురువారం జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.
డిసెంబరు 1, 2020న గ్రేటర్ ఎన్నికలు నిర్వహించగా, 4వ తేదీన ఫలితాలు వెలువడిన విషయం విదితమే. గెలిచిన సభ్యుల పేర్లతో జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్-66 ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం రాజపత్రాన్ని ప్రచురిస్తుంది. అనంతరం నెల రోజుల్లో పాలక మండలి మొదటి సమావేశం జరగాలి. ఈ సమావేశంలోనే మేయర్, ఉపమేయర్‌లను ఎన్నుకుంటారు. గత పాలకమండలి సమావేశం ఫిబ్రవరి 11, 2016 నిర్వహించినట్లు పేర్కొంది.
- ఇవీచూడండి: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే