హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అంతర్గత రోడ్లను ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసేందుకు లింక్, స్లిప్ రోడ్లను నిర్మిస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగరంలోని ఎన్జీవో కాలనీ నుంచి ఎన్ఐఏబీ ద్వారా గోపన్ పల్లి వరకు ప్రతిపాదిత లింక్ రోడ్ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ లింక్ రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు. మల్కంచెరువు నుంచి చిత్రపురి కాలనీ వరకు 500 మీటర్లు పొడవున నిర్మిస్తున్న లింక్ రోడ్డులోని మతపరమైన నిర్మాణాలను తొలగించేందుకు స్థానికులతో మాట్లాడి ఒప్పించారు. ల్యాంకో హిల్స్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు... సర్వీసు రోడ్డు వరకు నిర్మిస్తున్న కిలోమీటరు లింక్ రోడ్ అలైన్మెంట్ను పరిశీలించారు. భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. స్థానిక శాసనసభ్యులు, రైతులతో మరోసారి సమావేశమై చర్చించనున్నట్లు మేయర్ వెల్లడించారు.
ఇవీ చూడండి: కరోనా 2.0: చైనాలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు