ETV Bharat / state

మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత - రక్తపరీక్షల్లో ఏం తేలిందంటే? - మయోనైజ్​ తిని 17 మంది అస్వస్థత

Mayonnaise Food Poison in Hyderabad : చూడటానికి వెన్నపూసలా కనిపించే దీని పేరే మయోనైజ్. దీనిని గుడ్డుతో తయారు చేస్తారు. ఇది ఓ హాటల్​ నిర్లక్ష్యంతో కస్టమర్లకు విషంలా మారింది. ఆ హోటల్​లో షవర్మతో కలిపి మయోనైజ్​ను ఆరగించిన కస్టమర్లు వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. గత ఐదు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధితుల సంఖ్య 17కు పెరిగింది.

Mayonnaise Food Poison in Hyderabad
Mayonnaise Food Poison
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 11:04 AM IST

Mayonnaise Food Poison in Hyderabad : వెన్నపూసలా కనిపించే మయోనైజ్‌, అల్వాల్‌లోని గ్రిల్​హౌజ్‌ హోటల్‌ నిర్లక్ష్యంతో విషంలా మారింది. షవర్మ అనే మాంసాహార వంటకంతో కలిపి మయోనైజ్‌ను ఆరగించిన వారు విరేచనాలు, వాంతులు, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఐదు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో, మొదట నలుగురు బాధితులుండగా, మంగళవారానికి ఆ సంఖ్య 17కి పెరగడంతో స్థానికంగా పరిస్థితులు వేడెక్కాయి. బాధితులంతా కంటోన్మెంట్‌ జనరల్‌ ఆసుపత్రి, హర్ష ఆసుపత్రి, బాలనగర్​, బోయిన్‌పల్లిలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతా ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్నారని, హర్ష ఆసుపత్రిలోని బాధితుల రక్తంలో హానికర సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ అయిందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.

Shawarma With Mayonnaise Food Poison : అల్వాల్‌ లోతుకుంటలోని గ్రిల్‌ హౌజ్‌ హోటల్‌లో ఈనెల 12న శుక్రవారం సాయంత్రం మయోనైజ్‌(గుడ్డుతో తయారు చేసిన)తో కలిపి షవర్మను ఆరగించిన కొందరు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆసుపత్రిలో చేరారని జీహెచ్​ఎంసీ ఆహార భద్రతా అధికారి లక్ష్మీకాంత్ తెలిపారు. వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించమన్నారు. బాధితుల రక్తపరీక్షల్లో సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. సోమవారానికి బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిందని ఆయన వివరించారు.

మటన్​ బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లు - చితకబాదిన వెయిటర్లు ​

ఎందుకు విషంలా మారుతోంది? : మండి బిర్యానీ, పిజ్జాలు, బర్గర్లు, కబాబ్‌లు, శాండ్‌విచ్‌లపై ఈ మయోనైజ్‌ను రాసుకుని తింటారు. సాధారణంగా గుడ్డులోని పచ్చసొన, నూనె, నిమ్మ రసంతో దీన్ని తయారుచేస్తారు. ఈ క్రమంలో చాలామంది శుభ్రతను పాటించట్లేదనే చెప్పాలి. కొందరు గుడ్లు శుభ్రం చేయకుండా, అపరిశుభ్రతతో తయారు చేస్తుంటారు. అలా దాన్ని తింటే అనారోగ్యం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా తయారైన మయోనైజ్‌ను కూడా నాలుగు గంటల్లోపు వాడేయాలని, అంతకు మించి నిల్వ ఉంచిన కోడిగుడ్డు మయోనైజ్‌ విషంలా మారొచ్చని ఎఫ్‌ఎస్‌ఓ లక్ష్మీకాంత్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌రెడ్డిని దీనిపై వివరణ కోరగా, మయోనైజ్‌తో చాలామంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని, ప్రతినెలా ఒకట్రెండు ఫిర్యాదులు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిర్లక్ష్య హోటళ్లపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

గ్రిల్‌హౌజ్‌ హోటల్‌ నిర్వాహకుడి అరెస్టు : అల్వాల్‌లోని ఓ హోటల్‌లో షవర్మ తిని అస్వస్థతకు గురైన ఘటనలో బాధితులకు సంఖ్య 17కు చేరింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అల్వాల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌దేవ్‌ వెల్లడించారు. లోతుకుంట పరిధిలోని గ్రిల్‌హౌజ్‌ హోటల్‌లో ఈ నెల 13వ తేదీన షవర్మ తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. 13 మంది బాధితులు కంటోన్మెంట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురు సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు వైద్య నివేదిక ఆధారంగా బాధితులు కలుషిత ఆహారంతోనే అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గ్రిల్‌హౌజ్‌ హోటల్‌ నిర్వాహకుడు తౌఫిక్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులను అల్వాల్‌ కార్పొరేటర్‌ విజయశాంతి జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరామర్శించారు.

Hyderabad Hotel Staff Beating Customers : బిర్యానీ తినడానికి రెస్టారెంట్​కు వెళ్తే.. తిట్లు.. తన్నులు వడ్డిస్తున్నారు!

నేను బిర్యానీలో రైతా తినడం మానేశాను బ్రదర్.. పెరుగు అడిగితే కొట్టి చంపారట.. హోటల్​లో డ్రగ్స్ సరఫరానట.. ఏంటీ బ్రో ఇది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.