హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మే డే వేడుకలను నిర్వహించారు. పార్టీ నేతలు భౌతిక దూరం పాటిస్తూ.. వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పార్టీ జెండాను ఎగురవేశారు.
లాక్‌డౌన్ వల్ల కార్మిక లోకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని సీతారాములు పేర్కొన్నారు. అనేక కంపెనీలు మూతపడుతుండటం వల్ల కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మే డే స్ఫూర్తితో కార్మికుల పక్షాన పోరాడేందుకు సీపీఏం, ప్రజాసంఘాలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.