మాట్రిమోనీ సైట్‌ని వాడుకుని ఒక యువతిని మోసం చేసాడు ఫిజియో థెరపి విద్యార్థి బాణోత్ సాయినాథ్. ఖమ్మంకి చెందిన సాయినాథ్‌ని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. మాట్రిమోనీలో అమ్మాయి పెట్టిన ప్రొఫైల్ నుంచి బాధితురాలి ఫోటోలు, ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ ద్వారా తన పేరు అవినాష్ రెడ్డి అని చెప్పి చాట్ చేశాడు.
కొన్నాళ్ల స్నేహం తర్వాత పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఇలా.. మాయమాటలు చెప్పి బాధితురాలు నుంచి రూ. 2.8 లక్షలు తీసుకున్నాడు. బాధితురాలు మలేషియాలో ఐటీ జాబ్ చేస్తుంది. ఈమెతో పాటు మరి కొంతమంది ఇతర రాష్ట్రాల అమ్మాయిలని కూడా డాక్టర్ సాయినాథ్ పేరుతో మోసం చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. వచ్చిన డబ్బులతో నిందితుడు ఖరీదైన బైక్లు కొని జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రియుడితో పెళ్లి జరగదనే భయంతో బాలిక ఆత్మహత్య