IPS Officers Transfers in Telangana: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 50 మందికి పైగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్, రామగుండం సీపీలు, నల్గొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్‌నగర్ ఎస్పీలు బదిలీ అయిన వారి జాబితాలో ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో గత కొంతకాలంగా వినిపిస్తోన్న ఐఏఎస్ అధికారుల బదిలీలు మాత్రం మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైన నేపథ్యంలో సమావేశాల తర్వాతే బదిలీలు ఉండవచ్చని అంటున్నారు. అయితే కీలకమైన రెవెన్యూశాఖ సహా మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటికి మాత్రం త్వరలోనే అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
ఐఏఎస్ అధికారుల బదిలీ అంశం గత కొన్నాళ్లుగా పదేపదే వినిపిస్తోంది. చాలా కాలం నుంచి బదిలీలు జరుగుతాయన్న ప్రచారం సాగుతోంది. కొందరు మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ బదిలీల విషయమై కసరత్తు కూడా చేశారు. అయితే వివిధ కారణాల రీత్యా బదిలీలు వాయిదా పడుతూ వచ్చాయి.
ఇవీ చూడండి..