కరోనా కట్టడికి హైదరాబాద్ పోలీసులు తోడ్పాటు అందిస్తున్నారని... నారాయణగూడ సీఐ గట్టుమల్లు తెలిపారు. చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, భాజపా నాయకుడు కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో... ఏర్పాటు చేసిన మాస్క్‌లు, శానిటైజర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని... కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.
రెండో దశ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో చేతన ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి ఉచితంగా మాస్క్‌లు, శానిటైజర్లు అందజేస్తున్న శ్రీధర్‌ను... సీఐ అభినందించారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెరాస