ETV Bharat / state

బెదిరింపులు భరించలేక... వివాహిత ఆత్మహత్య - crime in Hyderabad

ఆమె నగ్న చిత్రాలు తీసి... తరచూ బెదిరించేవాడు. డబ్బు, బంగారం తీసుకుని కూడా... సోషల్​ మీడియాలో పెడతానని బ్లాక్​మెయిల్​ చేశాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వివాహిత... ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​ ఎస్సార్​ నగర్​లో చోటుచేసుకుంది.

Married women suicide in sr nagar, Hyderabad
బెదిరింపులు భరించలేక... వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Feb 8, 2020, 6:42 PM IST

హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని కైలాష్​నగర్​లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఓ వ్యక్తి తన నగ్న చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడడం వల్ల మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి భర్త తెలిపారు.

కైలాష్​నగర్​కు చెందిన స్వప్నకు... ఉప్పుగూడకు చెందిన అరుణ్​తో వివాహం జరిగింది. ఉప్పుగూడకు చెందిన ప్రశాంత్​... స్వప్న నగ్నచిత్రాలు తీసి బెదిరించాడు. ఆమె నుంచి డబ్బు, బంగారం తీసుకుని కూడా బెదిరింపులకు పాల్పడడం వల్ల.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతురాలి భర్త అరుణ్​ తెలిపారు.

అయినా నగ్న చిత్రాలను సోషల్​ మీడియాలో పెడతానని బెదిరించాడని... ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా.. ఏమి చేయకపోవడం వల్లే మనస్తాపం చెంది... తన భార్య ఉరివేసుకుని చనిపోయిందని చెప్పారు. ఎస్సార్​ నగర్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెదిరింపులు భరించలేక... వివాహిత ఆత్మహత్య

ఇదీ చూడండి: ఎఫ్​డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.