సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన సుమిత్ర అనే వివాహిత ఎలాంటి సమాచారం లేకుండా ఇంటి నుంచి అదృశ్యమైంది. తిరుమలగిరిలో నివాసముండే నేమారామ్-సుమిత్ర దంపతులు స్థానికంగా ఓ షాప్ను నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో సుమిత్ర షాప్ నుంచి బయల్దేరి దోమల నివారణ మందులు తీసుకొని వారి నివాసానికి వెళ్లింది.
ఆమె భర్త దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్లేసరికి అతనికి సుమిత్ర కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. భర్త నేమారామ్ ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: మానవ మృగానికి మరణ దండన