ETV Bharat / state

'మ్యారేజ్​ బ్యూరో నిర్వాహకురాలికి న్యాయం చేయాలి' - హైదరాబాద్​ సమాచారం

మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులను బెదిరించడం తగదని ఆలిండియా మ్యారేజ్​ బ్యూరోస్​ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్​లో​ డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో గుండె నొప్పితో ఓ నిర్వాహకురాలు మరణించిందని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Marriage beauros demands dont warns against our works
'మ్యారేజ్​ బ్యూరో నిర్వాహకురాలికి న్యాయం చేయాలి'
author img

By

Published : Nov 15, 2020, 6:08 PM IST

మ్యారేజ్​ బ్యూరోల నిర్వాహకుల పట్ల పోలీసుల వైఖరి మారాలని హైదరాబాద్​లో జరిగిన సమావేశంలో ఆలిండియా అసోసియేషన్​ అధ్యక్షుడు భానుప్రకాశ్ రెడ్డి కోరారు. తమను చిన్నచూపు చూస్తూ ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదన్నారు. కొందరు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మిర్యాలగూడకు చెందిన సత్యనారాయణ, కుత్బుల్లాపూర్​కు చెందిన దాసరి నర్సింగరావుల పిల్లల వివాహానికి రూ.6 లక్షలకు ఒప్పందం కుదిరిందన్నారు. డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేయడంతో సంతోషిమాత మాలతీ మ్యారేజ్​ బ్యూరో నిర్వాహకులు గుండెనొప్పితో మరణించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని అసోసియేషన్​ జాతీయ అధ్యక్షుడు భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.