Marri Shasidhar Reddy to join BJP: కాంగ్రెస్ సీనియర్ నేత, సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి భాజపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి శుక్రవారం రాత్రి ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. దాదాపు 35 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి కుటుంబ నేపథ్యాన్ని అమిత్‌షాకు సంజయ్ వివరించినట్లు తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా శశిధర్‌రెడ్డి తండ్రి చెన్నారెడ్డి పని చేశారని అమిత్ షాకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగింది. 28వ తేదీ నుంచి అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు సంజయ్ తెలిపారు.
అనంతరం అమిత్‌షా మాట్లాడుతూ శశిధర్‌రెడ్డి భాజపాలో చేరాలనుకోవడం శుభపరిణామమంటూ వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు తెలిపాయి. తాను హైదరాబాద్ వెళ్లి తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలోనే పార్టీలో చేరతానని షాకు శశిధర్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. భేటీలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: