ETV Bharat / state

'డీ లిమిటేషన్​ ప్రక్రియ మరోసారి చేపట్టాలి'

author img

By

Published : Jul 13, 2019, 7:29 PM IST

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అక్టోబర్ వరకు గడువు ఉన్నప్పటికి... నెల రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం దురుద్దేశ్యంతో వ్యవహారిస్తోందని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఆఘమేఘాల మీద కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఏముందని అయన ప్రశ్నించారు.

municipal elections

ఇప్పటికే ఉన్న చట్ట ప్రకారమే మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించాల్సిందని... ఆఘమేఘాల మీద కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ సమావేశంలో... రాబోయే మున్సిపల్ ఎన్నికలు, డీ లిమిటేషన్స్‌, తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. డీ లిమిటేషన్‌ కూడా గట్టు చప్పుడు కాకుండా చేశారని ఆరోపించారు. బైంసా, శంషాబాద్ మున్సిపాలిటీల డీ లిమిటేషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చిందని... ఇంకా కొన్ని మున్సిపాలిటీలపై కేసులు రాబోతున్నాయని మర్రి పేర్కొన్నారు. డీ లిమిటేషన్​ ప్రక్రియను మరోసారి చేపట్టాలని మర్రి శశిధర్​ రెడ్డి డిమాండ్​ చేశారు.

'డీ లిమిటేషన్​ ప్రక్రియ మరోసారి చేపట్టాలి'

ఇవీ చూడండి:'గోల్కొండ ఖిల్లాపై భాజపా జెండా ఎగురవేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.