ఉల్లి ధరలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. విపణిలో పెరుగుతున్న ధరల దృష్ట్యా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ సంచాకులు లక్ష్మీబాయి, హైదరాబాద్ మలక్‌పేట వ్యవసాయ విపణిలో మార్కెటింగ్ కమిటీ అధికారులు, ఉల్లి కమీషన్ ఏజెంట్లు, వర్తకులతో సమావేశమయ్యారు. తాజా ఉల్లి ధరలపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 30న వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన విపణిలో గ్రేడ్ -1 రకం క్వింటాల్ ధర రూ. 2300 నుంచి 3 వేల వరకు ఉన్నట్లు చెప్పారు. మలక్‌పేట విపణిలో ఉల్లి ధరలు గత వారం కంటే టోకు ధరలు క్వింటాల్ 3000 రూపాయలు నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మలక్‌పేట విపణిలో నిరంతరం నిఘా ఉంచాలని సంచాలకులు ఆదేశించారు.
ఇదీ చూడండి :రవీంద్ర భారతిలో ఉప్పొంగిన కళాసంద్రం...