MD Sailaja Kiran at silk expo: చేనేత ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ కళింగ హాలులో ఏర్పాటుచేసిన సిల్క్ ఎక్స్పోను శైలజా కిరణ్ ప్రారంభించారు.
![MD Sailaja Kiran at silk expo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14597788_3.png)
మార్చి 7వరకు జరగనున్న ఈ వస్త్రాల ప్రదర్శనలో 14 రాష్ట్రాల నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ ఆసక్తిగా పరిశీలించిన శైలజా కిరణ్ చేనేతలో ఉన్న నాణ్యతను మిగతావాటితో పోల్చలేమని అభిప్రాయపడ్డారు. మన సాంప్రదాయాల్లో భాగమైన చేనేత కళను ఆదరించాల్సిన అవసరముందని, ప్రభుత్వాలతోపాటు ప్రజలూ ముందుకురావాలని ఆమె సూచించారు.
![MD Sailaja Kiran at silk expo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14597788_1016_14597788_1646063515826.png)
ప్రస్తుతం మనదేశంలో 43 లక్షలమంది హ్యాండ్లూమ్స్ మీద ఆధారపడి ఉన్నారు. మొత్తం రూ.50 వేల కోట్లు ఉత్పత్తి జరుగుతోంది. పవర్లూమ్ ఒకరోజుకు పాతిక మీటర్లు తయారు చేస్తే చేనేత వస్త్ర కేవలం ఒక మీటరే ఉత్పత్తి అవుతుంది. కానీ పవర్ లూమ్ కంటే హ్యాండ్లూమ్లో క్వాలిటీ, మన్నిక చాలా ఎక్కువ. హ్యాండ్లూమ్ అనేది మన సంప్రదాయం. మనం చేనేత కళలను ఆదరించడం బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కటీ ప్రభుత్వమే చేయాలని కాదు. మనం కూడా చేనేత కళలను ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగ చీరలతో వారికి అండగా నిలుస్తోంది. - శైలజా కిరణ్, మార్గదర్శి ఎండీ
ఇదీ చూడండి:
Numaish Exhibition : భాగ్యనగర వాసులకు గుడ్న్యూస్.. రేపటి నుంచే నుమాయిష్