రాష్ట్ర రాజధాని నగరాన్ని వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు. భారీ వర్షాలతో తడిసి ముద్దయిన భాగ్యనగర ప్రజలు ఇంకా కోలుకోలేదు. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా జలదిగ్భంధంలోనే చిక్కుకున్నాయి.
ప్రధాన కూడలి ఖైరతాబాద్, చింతల్‌బస్తీ ప్రాంతాల్లో రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో గంటలకొద్ది ట్రాఫిక్ నిలిచిపోతోంది. శ్రీనగర్ కాలనీ, ఆనంద్‌నగర్‌లో రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ముంపునకు గురై తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు.