ETV Bharat / state

వ్యాక్సినేషన్‌లో... వీరు సైతం! - తెలంగాణ వార్తలు

ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు తమ పౌరులకు కొవిడ్‌ టీకా వేసే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. వందల కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి అటు ప్రభుత్వాలూ, ఇటు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతోపాటు మరికొన్ని భారతీయ కంపెనీలూ అహర్నిశలూ కృషి చేస్తున్నాయి.

many organisations working for vaccination , corona vaccination
కరోనా వ్యాక్సినేషన్​కు సాయం, కొవిడ్ వ్యాక్సినేషన్
author img

By

Published : Apr 4, 2021, 1:20 PM IST

కొవిడ్‌పైన పోరాటానికి వ్యాక్సిన్లు సిద్ధం... అనగానే, కరోనా కోరల్ని పీకేస్తున్నామన్న భావన కలిగింది అందరిలో. అయితే టీకాని తయారీ కేంద్రాల నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తరలించడం ఓ పెద్ద ప్రక్రియ. ముఖ్యంగా వాటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ఫ్రిజ్‌లలో భద్ర పరచాలి. వీటికోసం ఉన్నవే మెడికల్‌ రిఫ్రిజిరేటర్లు. కొవాక్సిన్‌, కొవీషీల్డ్‌ లాంటి వ్యాక్సిన్లను 2-8డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉండగా, ఫైజర్‌లాంటి వ్యాక్సిన్లను మైనస్‌ 20-80 డిగ్రీల సెల్సియస్‌ ఉన్న ఫ్రిజ్‌లలో ఉంచాలి. అతి శీతల రిఫ్రిజిరేటర్ల అవసరం వైద్య రంగంలో ఉంటుందని గుర్తించిన గోద్రెజ్‌ సంస్థ ముందుచూపే మన వ్యాక్సినేషన్‌ ప్రక్రియని మరింత సులభతరం చేసిందని చెప్పాలి.

వ్యాక్సిన్ల రిఫ్రిజిరేటర్లు...

అయిదేళ్ల కిందట బ్రిటన్‌కు చెందిన ‘ష్యూర్‌ చిల్‌’ సంస్థ నుంచి ఈ సాంకేతికతకు సంబంధించిన హక్కులు సొంతం చేసుకుంది గోద్రెజ్‌. తర్వాత తమ సొంత పరిశోధన-అభివృద్ధి కేంద్రంలో కరెంటులేని సమయంలోనూ ఏడెనిమిది గంటలు ఉష్ణోగ్రతలు తక్కువ కాకుండా ఉండే సాంకేతికతను తయారుచేసింది. అప్పట్నుంచీ ఈ తరహా ఫ్రిజ్‌లను ఏడాదికి 12 వేల యూనిట్ల సామర్థ్యంతో తయారుచేస్తోంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్టోబరులోనే గోద్రెజ్‌కు 12 వేల రిఫ్రిజిరేటర్ల తయారీకి ఆర్డర్లు ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 25 శాతం ప్రభుత్వానికి అందాయి. విదేశాల నుంచీ ఆర్డర్లు పెరగడంతో తమ సామర్థ్యాన్ని 30వేల యూనిట్లకు పెంచాలనుకుంటోంది గోద్రెజ్‌.

నిమిషానికి వేల సిరంజీలు...

నిమిషానికి వేల సిరంజీలు...

హిందుస్థాన్‌ సిరంజెస్‌ అండ్‌ మెడికల్‌ డివైసెస్‌... హరియాణాలో ఉన్న ఈ సంస్థకు పలు దేశాల నుంచి కోట్లలో వ్యాక్సినేషన్‌ సిరంజీలు కావాలంటూ ఆర్డర్లు వస్తున్నాయి. నిజానికి ఏ వాణిజ్య సంస్థకైనా ఇదో బంపర్‌ ఆఫర్‌. కానీ ఈ సంస్థ ప్రస్తుతానికి కొత్త ఆర్డర్లు తీసుకోలేమని సున్నితంగా తిరస్కరిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తీసుకున్న ఆర్డర్ల సరఫరాకే సామర్థ్యానికి మించి పనిచేస్తోందీ సంస్థ. నిజానికి కంపెనీ సామర్థ్యం నిమిషానికి 6000 సిరంజీలు కాగా, కొవిడ్‌ నివారణలో భాగమవ్వాలని పని గంటల్ని పెంచి నిమిషానికి 8200 తయారుచేయిస్తోంది. యునిసెఫ్‌ నుంచి వ్యాక్సినేషన్‌ కోసం గత నవంబరులోనే 14 కోట్ల సిరంజీల తయారీకి ఆర్డర్లు పొందిందీ సంస్థ. భారత ప్రభుత్వానికి ఇప్పటికే 18 కోట్ల సిరంజీలు అందించగా, సెప్టెంబరుకల్లా వివిధ విడతల్లో 26.5కోట్ల(రూ.55కోట్లు) ఆర్డర్‌ అందుకుంది. భారత్‌ నుంచి వచ్చే ఆర్డర్లకు తొలి ప్రాధాన్యమని చెబుతారు సంస్థ ఎండీ రాజీవ్‌నాథ్‌. కొవిడ్‌ నేపథ్యంలో కొంత మొత్తం చెల్లిస్తే ముందుగానే సిరంజీల తయారీ ప్రారంభిస్తామని గతేడాది మధ్యలోనే కొన్ని ఆరోగ్య సంస్థలూ, ప్రభుత్వాలకు చెప్పినపుడు వాళ్లు స్పందించకపోవడంతో రిస్కు చేసి మరీ వాటి ఉత్పత్తి మొదలుపెట్టిందీ సంస్థ. వ్యాక్సిన్‌ ఏ మాత్రం వృథా కాకుండా 0.3 ఎం.ఎల్‌, 0.5 ఎం.ఎల్‌ సామర్థ్యం ఉన్న సిరంజీలను ప్రత్యేకంగా తయారుచేస్తోంది. వీటిని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా.

‘కూల్‌’గా తరలిస్తారు!

‘కూల్‌’గా తరలిస్తారు!

జనవరి 12... దేశంలో మొట్టమొదటి సారిగా పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ బయటకు వచ్చిన రోజు. వ్యాక్సిన్లు నింపిన పెట్టెల్ని సీరమ్‌ ప్లాంట్‌ నుంచి విమానాశ్రయానికి ప్రత్యేక ట్రక్‌లలో తరలించింది ‘కూల్‌ ఎక్స్‌’ సంస్థ. అవి అక్కణ్నుంచి దేశంలోని నాలుగు ప్రధాన నగరాలకు వెళ్లాయి. ఆ విమానాశ్రయాల నుంచి వ్యాక్సిన్‌ బాక్సులను మరికొన్ని రాష్ట్రాలకు కూల్‌ ఎక్స్‌ ట్రక్‌ల ద్వారానే మళ్లీ తరలించారు. ఈ సంస్థను ముంబయికి చెందిన సోదరులు కునాల్‌, రాహుల్‌ అగర్వాల్‌ కొన్నేళ్ల కిందట ప్రారంభించారు. ఫార్మా రంగంలో సేవలందించడానికి దీన్ని నడుపుతున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా అవకాశం రాగానే వెంటనే అందిపుచ్చుకున్నారు. జీపీఎస్‌ అమర్చిన ఈ ట్రక్‌ లోపలి ఉష్ణోగ్రతల్నీ కంప్యూటర్‌ సాయంతో పర్యవేక్షించవచ్చు. ట్రక్‌ తలుపులు ఎక్కడ, ఏ సమయంలో తెరుచుకున్నదీ తెలుస్తుంది. ఈ సంస్థకు ఇలాంటివి మొత్తం 400 ట్రక్‌లు ఉన్నాయి. ‘రవాణాలో అత్యున్నత భద్రత, నాణ్యతా ప్రమాణాలు అవసరమైన ఈ విభాగంలో దేశం అవసరాలు తీర్చినందుకు మేం ఎంతో గర్వపడుతున్నాం’ అని చెబుతారు రాహుల్‌. కేవలం మనదేశంలోనే కాదు, విదేశాంగశాఖతో కలిసి కొన్ని సార్క్‌ దేశాల్లోనూ ఈ సంస్థ ప్రస్తుతం సేవలు అందిస్తోంది.

ఇదీ చదవండి: వెదురు పళ్లెంలో తినేద్దామా?!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.