ETV Bharat / state

కరోనా కాటు: జీవన చక్రం ఆగింది.. బతుకు చిత్రం మారింది! - తెలంగాణ వార్తలు

నమ్ముకున్న బండి నడిరోడ్డుపై నిలబెట్టింది. అప్పోసొప్పో చేసి జీవితంలో స్థిరపడ్డాం అనుకునే దశలో కోలుకోలేని దెబ్బతీసింది లాక్‌డౌన్‌. మళ్లీ ఆవైపు చూడాలంటేనే భయపెట్టింది. నెలల వ్యవధిలోనే పూర్తి బతుకు చిత్రాన్ని మార్చింది. ఇన్నాళ్లూ నగరవాసుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన వారంతా ఇప్పుడు గమ్యం లేకుండా మిగిలిపోయారు. ఓవైపు కరోనా లాక్‌డౌన్‌, మరోవైపు పెరుగుతున్న చమురు ధరలు నడ్డి విరుస్తుంటే తట్టుకోలేక ఉన్న వాహనాల్ని అమ్మేసి కూలీనాలీ చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు కొందరు ప్రైవేటు క్యాబ్‌ డ్రైవర్లు.

cab drivers, drivers problems in hyderabad
కూలీలుగా క్యాబ్ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు
author img

By

Published : Apr 17, 2021, 9:00 AM IST

కరోనా మహమ్మారి కారణంగా క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అప్పోసొప్పో చేసి క్యాబ్ కొని బతుకు బండిని నడుపుతున్న వారి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఎందరినో గమ్య స్థానాలకు చేర్చిన వారు... ప్రస్తుతం ఏ గమ్యం లేకుండా మారిపోయారు. ఓ వైపు కరోనా, మరోవైపు చమురు ధరలతో వారి పరిస్థితి దీనంగా మారింది.

కట్టకపోతే.. పట్టుకుపోతున్నారు

నగరంలో నడుస్తున్న ప్రైవేటు క్యాబ్‌ల్లో దాదాపు 80 శాతం ఫైనాన్స్‌లో ఉన్నవే. లాక్‌డౌన్‌ తర్వాత నగరంలో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గడం, ఐటీ ఉద్యోగులూ లేకపోవడంతో బండి రోడ్డెక్కినా ప్రయోజనం ఉండట్లేదు. రోజువారీ ఆదాయం ఇల్లు గడిచేందుకే సరిపోవట్లేదు. కొందరు అప్పులు చేసి కడుతుండగా.. కట్టలేని వారిని ఫైనాన్షియర్లు ఒత్తిడి చేసి వాహనాల్ని పట్టుకెళ్లిపోతున్నారు. రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చిందని డ్రైవర్లు వాపోతున్నారు.

  • లాక్‌డౌన్‌కి ముందు 1.40 లక్షల ప్రైవేట్‌ క్యాబ్‌లు నడిచేవి. లాక్‌డౌన్‌ తర్వాత 40 వేలే రోడ్డెక్కుతున్నాయి.
  • ఓలా, ఉబర్‌లాంటి అగ్రిగేటర్లు డ్రైవర్లకు కి.మీ.కు రూ.13 నుంచి రూ.15 చెల్లించేవి. డీజిల్‌ ధర రూ.60 ఉన్నప్పుడు ఇదే ధర.. ఇప్పుడు రూ.84 అయినా అదే కొనసాగిస్తుండడంతో పాటు వివిధ పన్నులు, 25% కమీషన్లు తీసుకోవడంతో డ్రైవర్లకు రోజుకూలీ మిగలట్లేదు. కమీషన్లు తగ్గించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
కూలీలుగా క్యాబ్ డ్రైవర్లు

భార్య పుస్తెలమ్మినా.. కారు దక్కలేదు..

ఉపాధి కోసం ఏళ్ల కిత్రం పల్లె వదిలి నగరానికి వచ్చారు జనార్దన్‌. కుటుంబంతో కలిసి నార్సింగిలో ఉంటున్నారు. తెలిసింది డ్రైవింగ్‌ ఒక్కటే కావడంతో రెండేళ్ల క్రితం ఫైనాన్స్‌లో కారు కొన్నారు. లాక్‌డౌన్‌లో కారు రోడ్డెక్కలేదు. పూట గడవడం కష్టమైంది. ఫైనాన్స్‌ చెల్లించేందుకు చేతిలో డబ్బుల్లేక.. ఫైనాన్షియర్ల ఒత్తిడి తట్టుకోలేక భార్య పుస్తెలు అమ్మేశారు. రెండో నెలకు కిస్తీ కట్టేందుకు ఏమీ లేక కారునే వదిలేశారు. ప్రస్తుతం భవన నిర్మాణ కూలీగా ఉపాధి పొందుతున్నారు.

చెరుకు బండితో బతుకు బండి

చెరుకు బండి బతుకునిస్తోంది

ఈ చిత్రంలో కనిపిస్తున్న యువకుడి పేరు యాదగిరి. మధురానగర్‌ కాలనీలో ఉంటూ గత ఐదేళ్లుగా కార్‌ డ్రైవింగ్‌నే నమ్ముకుని జీవిస్తున్నాడు. లాక్‌డౌన్‌లో కార్లు రోడ్డెక్కకపోవడం, ఆతరువాత చమురు ధరలు భారంగా మారడంతో.. ఆ రంగాన్ని వదిలేసి పంజాగుట్ట కేంద్రం వద్ద చెరుకు రసం బండి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కమీషన్‌ తగ్గించుకోవాలి

యాప్‌ బేస్‌ రవాణా సంస్థలు డ్రైవర్ల సంక్షేమరీత్యా కమీషన్‌ను 10 శాతానికి తగ్గించాలి. పెట్రోల్‌ ధరల్ని జీఎస్టీలోకి చేర్చాలి. డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబాల్ని ఆదుకోవాలి. బయట పనులు దొరక్క బతుకులు సాగట్లేదు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

-షేక్‌ సలావుద్దీన్‌, తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జేఏసీ ఛైర్మెన్‌

ఇదీ చదవండి: తిరుపతి ఉప పోరు పోలింగ్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.