మంజీరా పైప్లైన్ పగిలి నీరు వృథాగా పోయి రహదారి జలమయం అయింది. సికింద్రాబాద్లోని బాలాజీ నగర్ వద్ద ఉన్న పైప్లైన్ పగిలి ఒక్కసారిగా రోడ్డుపై మంచి నీటి వరద ప్రవహించింది. నీరు ఎక్కువ మోతాదులో పోవడంతో పక్కనే ఉన్న మెకానిక్ దుకాణం జలమయం అయింది. జలమండలి అధికారులు పరిశీలించి నీటిని ఆపే ప్రయత్నం చేశారు.
మంచి నీరు వరద ప్రవాహంలా మారడంతో రోడ్డుపై ఇరువైపులా నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై నీటి పైప్లైన్లు సరి చేశారు.
ఇదీ చదవండి: పులి సంచారంతో వణుకుతున్న గ్రామాలు.. కొనసాగుతోన్న అన్వేషణ