manish sisodia ed remand report: విజయ్‌నాయర్‌ను కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో కలిశారని.. మద్యం విధానంలో ఎలా మార్పు చేస్తామనే విషయాలను కవితకు విజయ్‌నాయర్ వివరించారని బుచ్చిబాబు తెలిపారని ఈడీ వివరించింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోదియా తరపున విజయ్‌నాయర్ మద్యం విధానంపై పని చేశారని చెప్పారని తెలిపింది. మద్యం విధానంలో కవితకు అనుకూలమైన మార్పులు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఇచ్చేలా అవగాహన కుదిరిందని ఈడీ తన రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
మాగుంట రాఘవకు 32.5 శాతం, మేడమ్ అనగా కవితకు 32.5 శాతం, సమీర్ మహేంద్రుకు 35 శాతం ఇండో స్పిరిట్స్‌లో వాటా కుదిరిందని బుచ్చిబాబు చెప్పారని ఈడీ తెలిపింది. మద్యం విధానం అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే బుచ్చిబాబు చేతిలోకి వచ్చిందని వివరించింది. మద్యం విధానంలో కొన్ని భాగాలను బుచ్చిబాబు మొబైల్ ఫోన్‌లో గుర్తించినట్లు ఈడీ స్పష్టం చేసింది. 2021 జూన్‌లో ఐటీసీ కోహినూర్‌లో జరిగిన భేటీ తర్వాత రాజేష్ జోషి, సుధీర్‌లతో సమన్వయం చేసుకుని హైదరాబాద్ నుంచి డబ్బులు తెప్పించాలని దినేష్ అరోరాను విజయ్‌నాయర్ ఆదేశించారంది.
Delhi liquor case update: ''సుమారు రూ.20 నుంచి రూ.30 కోట్లు హవాలా మార్గంలో అభిషేక్ బోయినపల్లితో సమన్వయం చేసుకుని తెప్పించాలని చెప్పారు. 2021 సెప్టెంబర్‌లో కోటి రూపాయలు బెంగాలి మార్కెట్‌లోని హావాలా ఆపరేటర్ ద్వారా రాజేష్ అందుకున్నారు. సౌత్ గ్రూప్ నుంచి మొత్తం రూ.31 కోట్లు దినేష్ అరోరా అందుకున్నాడు. సౌత్ గ్రూపు, ఆప్ నేతలకు మధ్య వంద కోట్ల ఒప్పందం కుదిరిందని అరుణ్ పిళ్లై 2022 నవంబర్ 11న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో చెప్పారు. ఇదే విషయాన్ని 2023 ఫిబ్రవరి 16న ఇచ్చిన మరో స్టేట్‌మెంట్‌లో కూడా వెల్లడించారు''. రూ.100 కోట్ల ముడుపులు తీసుకుని ఈ విధంగా వ్యవహరించారని ఈడీ తెలిపింది.
ఇండోస్పిరిట్స్ ఫైల్‌ను తానే స్వయంగా పర్యవేక్షించినట్లు సిసోదియా విచారణలో అంగీకరించారని ఈడీ తెలిపింది. మద్యం కుంభకోణం చోటు చేసుకున్న ఏడాది కాలంలో సిసోదియా 14 మొబైల్ ఫోన్లు మార్చారని.. కొన్నింటిని ధ్వంసం చేశారని వివరించింది. 2 ఫోన్లను సీబీఐ సోదాల్లో రికవరీ చేసినట్లు ఈడీ తెలిపింది.
Manish Sisodia in ED investigation: అందరికి కలిపి మొత్తం రూ.292.8 కోట్ల ముట్టినట్లు ఈడీ స్పష్టం చేసింది. ముడుపుల ద్వారా రూ.100 కోట్లు, ఇండోస్పిరిట్స్ లాభం ద్వారా రూ.192.8 కోట్లు దక్కించుకున్నారంది. ముడుపుల విషయంలో సిసోదియా పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. రూ.292.8 కోట్లు దక్కిన వ్యవహారంలో సిసోదియా కీలకంగా వ్యవహరించారని ఈడీ తన రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది.
ఇవీ చదవండి:
కవితను అరెస్టు చేస్తారట.. చేయనివ్వండి: సీఎం కేసీఆర్
సిసోదియా మెడపై ఈడీ కత్తి.. జైలులోనే విచారణ.. కరుడుగట్టిన నేరస్థుల మధ్యే..
'లిక్కర్ స్కామ్‌లో కవితకు సంబంధం ఉందో లేదో కేసీఆర్, రేవంత్ స్పష్టం చేయాలి'