ETV Bharat / state

రంగంలోకి మాణిక్కం ఠాగూర్‌.. రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఆరా - కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తాజా వార్తలు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆరా తీస్తోంది. ఆదివారం తన నివాసంలో చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

రాజగోపాల్‌ రెడ్డి
రాజగోపాల్‌ రెడ్డి
author img

By

Published : Jul 25, 2022, 3:34 PM IST

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆరా తీస్తోంది. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేట్లు ఉన్నాయని పలువురు కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ .. ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి నిన్నటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు.. ఆయన గతంలో పార్టీపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇచ్చిన వివరణలకు చెందిన పూర్తి సమాచారం తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా తాజాగా సోనియాగాంధీ ఈడీ విచారణ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

తాను పార్టీ మారడం చారిత్రాత్మక అవసరమంటూ రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నఅధిష్ఠానం అన్ని విషయాలను పరిశీలిస్తోంది. తనకై తాను పార్టీ నుంచి రాజగోపాల్‌ రెడ్డి బయటకు పోయే అవకాశం లేదంటున్నకాంగ్రెస్‌ అధిష్ఠానం.. ఆయన పార్టీకి నష్టం కలిగించేట్లు చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఆరా తీస్తున్నారు.

అసలేెం జరిగిదంటే: సమయం వచ్చినపుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని రాజగోపాల్​రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ వ్యూహంలో తాను పావును కాదల్చుకోలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారతాయన్న రాజగోపాల్​.. ఆ పార్టీ బలహీనపడిందన్నారు. కేసీఆర్‌ను ఓడించే శక్తి భాజపాకే ఉందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. రేవంత్​పై పరోక్ష విమర్శలు..!

కలియుగ శ్రవణుడు.. అమ్మానాన్నలను భుజాలపై మోస్తూ వందల కి.మీ. యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.