Manik Rao Thakre Meeting With Congress Dissident Leaders : నామినేషన్ల ఉపసంహరణ(Withdrawal of nomination) గడువు బుధవారం(రేపటి)తో ముగియనుండటంతో తిరుగుబాటు అభ్యర్థులను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగించే పనిలో పడింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ థాక్రే, నాయకులు విష్ణునాథ్, మహేశ్‌కుమార్‌గౌడ్.. తిరుగుబాటు అభ్యర్థుల(Congress Rebels)తో వరుసగా భేటీ అవుతున్నారు. సూర్యాపేట, బోథ్, వైరా, ఇబ్రహీంపట్నం, ఆదిలాబాద్, వరంగల్ వెస్ట్, నర్సాపూర్.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న థాక్రే.. నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా.. తిరుగుబాటు చేసిన వారు తగ్గుతారా.. లేదంటే పోటీకి సిద్ధమవుతారా అనేది పోటీ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
కాంగ్రెస్ నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో టికెట్ దక్కని కాంగ్రెస్ అభ్యర్థులు బహిరంగంగానే.. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతున్నారు. తమకు టికెట్లు ఇవ్వకపోతే రెబెల్స్‌గా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్నికల బరిలో నిలుస్తామని సవాల్ విసురుతున్నారు. ఈ జాబితాలో టికెట్లు రాని సూర్యాపేట, బోథ్, వైరా, ఇబ్రహీంపట్నం, ఆదిలాబాద్, వరంగల్ వెస్ట్, నర్సాపూర్ నియోజకవర్గాల నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు.
సొంత పార్టీల్లో రేగుతున్న చిచ్చు బుజ్జగింపులతో బిజీగా ఉన్న అభ్యర్థులు
Telangana Election 2023 : సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని పటేల్ రమేశ్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. చివరి క్షణంలో ఈ నియోజకవర్గం టికెట్‌ను దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కేటాయించింది. పటేల్ రమేశ్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిని ఆయన అనుచరులు ముట్టడించారు. ఈమేరకు తమ నాయకుడిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామని సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమై ఆయనతో రేపు మాట్లాడనుంది. ఇలా దాదాపు 10 నియోజకవర్గాలకు చెందిన వారిని బుజ్జగించే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి చేరిన వారికే టికెట్లు ఇచ్చారని.. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన తమకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Dissident Leaders of Congress : మొదటి జాబితాలో అందరూ మాజీ నాయకులే కావున ఎక్కువ ప్రభావం చూపలేదు. కానీ రెండో జాబితా ప్రకటించినప్పుడే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ 45 మందితో రెండో జాబితా వచ్చినప్పటి దగ్గర నుంచి టికెట్లు రాని నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయని ముందుగా ఊహించలేదు. అందుకే నామినేషన్ల గడువు ముగిసే లేపే.. నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.
త్రిముఖపోరులో ప్రధాన పార్టీల హోరాహోరీ-విజయ బావుటా ఎగురవేసేదెవరో!
కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు నష్ట నివారణ చర్యల కోసం రంగంలోకి సీనియర్లు