Manik Rao Thakre Fires on BJP : తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలుస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు.. బీజేపీ నేతలను కలుస్తున్నారని మాణిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు. అందుకే వారిరువురు కూటమిని ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తున్నారనే ఊహాగానాలు తమకు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ సమస్యలపైనే బీజేపీ నేతలను కలిసినట్లుగా బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారని.. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
KTR Fires on PM Modi : 'అత్యంత బలహీన ప్రధాన మంత్రి.. నరేంద్ర మోదీ'
Manik Rao Thakre Comments on 2023 Assembly Elections : దీని ప్రకారం చూస్తే బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో దోస్తీ కోసం కూటమి కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోందని మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. అందుకే మద్యం కేసులో కవితను ఈడీ అరెస్టు చేయకుండా.. నాన్చుతుందని విమర్శించారు. వీటన్నింటినీ చూస్తే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకే.. ఆ పార్టీ పెద్దలను బీఆర్‌ఎస్ నేతలు కలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు.. బీజేపీ వైపు వెళుతుందనేందుకు ఇదే నిదర్శనమని మాణిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు.
''బీఆర్‌ఎస్ నేతలు.. బీజేపీ నేతలను కలుస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం నడుస్తోంది. కూటమి ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారని మాకు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం పెరుగుతోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా ఎవరూ అడ్డుకోలేరు.''- మాణిక్‌రావు ఠాక్రే
విపక్షాల మీటింగ్ జరిగితే.. బీఆర్‌ఎస్ దిల్లీలోనా..: బిహార్‌లోని పట్నాలో విపక్షాల మీటంగ్ జరిగితే.. మరోవైపు దిల్లీలో బీఆర్‌ఎస్ నేతలు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారని మాణిక్‌రావు ఠాక్రే మండిపడ్డారు. ప్రతిపక్షాల సమావేశం రోజే బీజేపీ మంత్రులను కేటీఆర్ కలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్‌ఎస్ కూటమి కట్టేందుకు దిల్లీలో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ వంటి బీజేపీ ముఖ్య నేతలను కలవడానికి వెళ్లారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని మాణిక్‌రావు ఠాక్రే గుర్తు చేశారు. 10 ఏళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉందని.. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు చాలా మంది టచ్‌లో ఉన్నారని చెప్పారు. త్వరలో చాలా మంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు.
ఇవీ చదవండి :