గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు అభ్యర్థులకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్, ఎంపీ రేవంత్ రెడ్డిలు అభినందనలు తెలిపారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఏఎస్‌రావు నగర్ నుంచి గెలుపొందిన శిరీషా సోమశేఖర్‌రెడ్డి, ఉప్పల్ డివిజన్ నుంచి విజయం సాధించిన రజిత పరమేశ్వర్ రెడ్డిలను ట్విట్టర్ వేదికగా అభినందించారు.
ప్రజా తీర్పును తాము శిరసా వహిస్తామని మాణికం ఠాగూర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున కృషి చేసిన పార్టీ శ్రేణులను ఎంపీ రేవంత్ రెడ్డి అభినందించారు.
ఇదీ చదవండి: గ్రేటర్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత..?