ETV Bharat / state

ఆందోళన వద్దు.. మీ మామిడి కొంటారు..

పంట చేతికొచ్చింది. మరి విక్రయించేది ఎలా. లాక్​డౌన్​తో రవాణా సౌకర్యాలు లేక మామిడి కాయలు ఎలా అమ్మాలి అని ఆందోళన చెందుతున్నారా?. మీరేం బాధపడకండి మామిడి కొనేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ముందుకొచ్చింది.

mangos can buy serf in telangana
ఆందోళన వద్దు.. మీ మామిడి కొంటారు..
author img

By

Published : Apr 15, 2020, 8:34 AM IST

స్థానికంగా మామిడిని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. లాక్‌డౌన్‌తో చిల్లర అమ్మకాలు లేక కొనలేమని ఉత్తరాది మార్కెట్లు సైతం చేతులెత్తేశాయి. ఒకవైపు కూలీల కొరత వేధిస్తోంది. మరోవైపు అకాల వర్షాలపై రైతుల్లో గుబులు పట్టుకుంది. ఎంతో కొంత ధరకు కొనేవాళ్లుంటే చాలనుకుంటున్న పరిస్థితుల్లో మామిడికాయలు కొనేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ముందుకొచ్చింది. ఇప్పటికే వారం రోజుల్లో 15 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. నాణ్యతను బట్టి కిలోకు రూ. 20 నుంచి రూ.35 వరకు ధర చెల్లించింది. తాజాగా రాష్ట్రంలో మామిడికాయల లభ్యత ఉన్న 13 జిల్లాల నుంచి కొనుగోలుకు సిద్ధమైంది.

ఇంటి వద్దకే సరఫరా

రైతుల నుంచి సేకరించిన మామిడికాయలను సెర్ప్‌ ఆధ్వర్యంలో ‘బెనిషాన్‌’ బ్రాండు పేరుతో మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. కాయలను సహజసిద్ధంగా పండ్లుగా మార్చి, మార్కెటింగ్‌ శాఖ సహకారంతో సంచార రైతుబజార్‌ల ద్వారా ఇంటి ముందుకే తీసుకురానున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లకు బల్క్‌గా సరఫరా చేయనున్నారు. పరిమాణం, నాణ్యతను బట్టి కిలోకు రూ.80, రూ.50 చొప్పున విక్రయించనున్నారు.

ఫోన్‌ చేస్తే చాలు

రైతులు ఫోన్‌లో సంప్రదిస్తే వారి వద్దకే వెళ్లి మామిడికాయలు కొంటామని సెర్ప్‌ సీవోవో రజిత తెలిపారు. కాయలను పండ్లుగా మార్చేందుకు అయ్యే ఖర్చు, మార్కెటింగ్‌ వ్యయం పోను లాభాల్లో రైతులకు వాటా ఉంటుందన్నారు. గతేడాది వచ్చిన లాభాల్లో రైతులకు కిలోపై రూ.3 బోనస్‌గా చెల్లించినట్లు పేర్కొన్నారు.

సెర్ప్‌ మామిడి కొననున్న 13 జిల్లాలు: ఖమ్మం, వనపర్తి, వరంగల్‌ గ్రామీణ, సూర్యాపేట, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌, జనగామ, జగిత్యాల, సిద్దిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్‌.

ఇదీ చూడండి:- 'లాక్​డౌన్​ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.