ETV Bharat / state

'కేసీఆర్​కు ప్రజాప్రతినిధులపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు' - MANDA KRISHNA MADIGA FIRES ON TRS GOVERNMENT

రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే... ముఖ్యమంత్రి కేసీఆరే ప్రమాదకర వైరస్​గా మారారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ఛైర్మన్ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సీఎం కేసీఆర్​కు ప్రజా ప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదా అని ప్రశ్నించారు.

mandakrishna madiga fires on kcr
'కరోనా కంటే... సీఎం కేసీఆర్​యే ప్రమాదకరం'
author img

By

Published : Mar 17, 2020, 7:23 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్​ను మహమ్మారిగా గుర్తిస్తే... దానిపై కూడా ముఖ్యమంత్రి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ఛైర్మన్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్​లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐక్య వేదిక కన్వీనర్లు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, మహిళలు పాల్గొన్నారు. వైరస్ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు కొన్ని ఆమోదయోగ్యంగా... మారి కొన్ని ఆక్షేపనీయంగా ఉన్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు.

రెండు వందల నుంచి ఐదు వందల మంది జనసంద్రం ఉండే సినిమా హాళ్లు, పబ్బులు, బార్లు మూసివేశారని... కానీ నిత్యం వేలాది మంది వచ్చి వెళ్లే వైన్స్ షాపులు ఎందుకు మూసివేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 20 వరకు కొనసాగాల్సిన అసెంబ్లీ సమావేశాలను మధ్యంతరంగా ఎందుకు వాయిదా వేశారని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోమని సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎందుకు అంత భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. తక్షణమే వైన్స్ షాపులు బంద్ చేయకపోతే... మహిళలను ఐక్యం చేసి ఉద్యమిస్తామన్నారు. నారాయణ, చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ప్రశ్నించారు.

'కరోనా కంటే... సీఎం కేసీఆర్​యే ప్రమాదకరం'

ఇవీ చూడండి: ముగ్గురు పిల్లలపై సవతితల్లి అరాచకత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.