Manchu Vishnu Hairdresser: తనపై మంచు ఫ్యామిలీ కావాలనే అక్రమ కేసు పెట్టిందని హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను ఆరోపించారు. సినీనటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో రూ. ఐదు లక్షల విలువైన సొత్తును నాగశ్రీను ఎత్తుకెళ్లాడంటూ జూబ్లీహిల్స్ ఠాణాలో ఆయన లీగల్ మేజనర్ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 39లోని కార్యాలయంలోంచి హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామగ్రిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాగశ్రీను తీసుకెళ్లాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వివరించారు.
మంచు మోహన్‌బాబు కుటుంబసభ్యులు కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టడం వల్లే ఉద్యోగం మానేశానని హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను చెప్పాడు. చోరీ పేరుతో అక్రమ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. పేదోడి జీవితంతో ఆటలాడుకోవద్దని వాపోయాడు.
ఇదీ చూడండి: Manchu Vishnu: సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ