Supreme Court verdict on Manchirevu lands : మంచిరేవుల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. 143 ఎకరాల భూవివాదానికి తెరదించుతూ సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది. భూ వివాదంపై సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఆక్రమణకు గురైన భూములు ప్రభుత్వానికే చెందుతాయని తీర్పును వెల్లడించంది. వివాదంలో ఉన్న ఈ భూములు గ్రేహౌండ్స్‌కు సంబంధించినవేనని స్పష్టం చేసింది. 1993లో 143 ఎకరాల గ్రేహౌండ్స్‌కు సంబంధించిన భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకోగా.. అసైన్డ్ భూముల ఆక్రమణదారులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులిచ్చింది.
అనంతరం ప్రభుత్వ నోటీసులపై ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం భూములు ప్రైవేటు వ్యక్తులకే చెందుతాయని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ప్రభుత్వం ఆశ్రయించింది. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాగా.. డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రైవేటు వ్యక్తుల పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పును ఇచ్చింది. ఇకపై కింది కోర్టులకు జోక్యం చేసుకునే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: