ETV Bharat / state

Roads: రహదారుల నిర్మాణాల్లో నిర్వహణా లోపాలు... రోడ్ల ఆనవాళ్లు మాయం! - defects in road construction in telangana

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రహదారులు వర్షంపాలయ్యాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీగా వర్షాలు నమోదు అయ్యాయి. నిర్మాణాల్లో లోపించిన ప్రమాణాలు, నిర్వహణా లోపాలు రహదారులను భారీగా దెబ్బతీస్తున్నాయి.

Management
రోడ్ల ఆనవాళ్లు మాయం
author img

By

Published : Jul 28, 2021, 4:54 AM IST

నిర్మాణాల్లో లోపించిన ప్రమాణాలు, నిర్వహణా లోపాలు రహదారులను భారీగా దెబ్బతీస్తున్నాయి. కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన రహదారులు వర్షాలతో ఒక్కోచోట ఆనవాళ్లే లేకుండాపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రహదారులు వర్షంపాలయ్యాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీగా వర్షాలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో జులై నెల సాధారణ వర్షపాతం కన్నా 85 శాతం అత్యధికంగా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో గంట వ్యవధిలో కుండపోతగా వర్షం కురవటంతో రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామీణ రహదారులే కాదు జాతీయ రహదారులు సైతం పాడయ్యాయి.

గుర్తించే పనిలో...

రహదారులు, భవనాల శాఖ వాటిని గుర్తించే పనిలో పడింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 25వ తేదీ వరకు 310 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. 1989 జులైలో 422.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఆ తరవాత జులై నెలలో ఇదే అత్యధిక వర్షపాతం. వాతావరణ శాఖ అంచనాల మేరకు జులై నెల సాధారణ వర్షపాతం 179.2 మిల్లీమీటర్లు. అయితే మంగళవారానికే 85 శాతం అదనంగా వర్షం కురిసింది. తారు...నీరు రెండింటినీ ఉప్పు... నిప్పులాంటి గుణాలతో పోలుస్తుంటారు రహదారుల నిపుణులు. నీరు నిలిచిన తారు రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగితే త్వరగా దెబ్బతింటుంది.

గుంతలు చిన్నచిన్నగా ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు నిర్వహణ చేపట్టగలిగితే రోడ్లు ఎక్కువ కాలం మనగలుగుతాయి. అలాగే రహదారి నిర్మాణం విషయంలో విస్తృత అధ్యయనం నిర్వహించాలి. ఆ మార్గంలో భూమి పటుత్వం, వాహనాల రాకపోకలు, మునుపటి వర్షపాతం తీరుతెన్నులను అధ్యయనం చేసిన తరవాత రహదారుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందాలి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో తరచుగా రహదారులు దెబ్బతింటున్నాయి. నిర్మాణ సమయంలో నిఘా మరింత పెంచాలి. ప్రతి రహదారి నిర్మాణ సమయంలో తనిఖీలు చేపడుతున్నప్పటికీ అవి కంటితుడుపుగానే ఉంటున్నాయి.

రహదారుల హిస్టరీ షీట్‌ కోసం కసరత్తు

రహదారుల నిర్వహణ విషయంలో హిస్టరీ షీటును నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ రోడ్డుపై ట్రాఫిక్‌ ఎంత ఉంటుంది? ఎంత లోడు కోసం నిర్మించారు? ఎలాంటి అధ్యయనాలు నిర్వహించారు? ఎప్పుడు నిర్మించారు? ఎన్ని దఫాలు మరమ్మతులు చేశారు? ఎంత వ్యయం అయింది? ఇలా పలు అంశాలతో కూడిన హిస్టరీ షీటును నిర్వహించటం ద్వారా అధికారులు, గుత్తేదారుల్లో జవాబుదారీతనం తెచ్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అనేక రహదారులకు సంబంధించి ఇలాంటి సమాచారం అంతంతమాత్రమే అందుబాటులో ఉంది. గ్రామీణ రహదారుల నుంచి జాతీయ రహదారుల వరకు ఇలాంటి వివరాలను కంప్యూటరీకరించాల్సిన అవసరం ఉందని ఓ ఉన్నతాధికారి అన్నారు.

కాంబరే కీలకం

కాంబర్‌

రహదారుల నిర్మాణంలో ఏటవాలుతనం (కాంబర్‌) కీలక భూమిక పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏ స్థాయి రహదారికి ఎంత ఏటవాలుతనం ఉండాలన్నది ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిర్ధారించింది. అమలే ప్రశ్నార్థకంగా ఉంది. దీన్ని అమలు చేస్తే రహదారిపై చుక్క నీరు నిలవదు. సిమెంటు రహదారులపై 1.7 నుంచి 2 శాతం ఏటవాలుతనం ఉండాలి. తారు రోడ్డుకు 2 నుంచి 2.5, మట్టిరోడ్లకు 3 నుంచి 4 శాతం ఉండాలి. నిర్మాణ సమయంలో భూమి పటుత్వాన్ని పరిగణనలోకి తీసుకొని కంకర, మట్టి, నాణ్యత ప్రమాణాల మేరకు వినియోగిస్తే రహదారి ఎక్కువ కాలం మన్నుతుంది.

నిర్లక్ష్యానికి నిలువుటద్దం...

ఇది రోడ్డే!

ఇది మూడు మండలాలకు దిక్కైన ప్రధాన రహదారుల్లో ఒకటి. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ నుంచి ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాలకు వెళ్లే మార్గం. గుత్తేదారుల, అధికారుల నిర్లక్ష్యానికి ఈ రహదారి పరాకాష్ఠ. రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. వర్షాలు వస్తే అది ఎంత లోతు ఉందో దిగితే కాని తెలియని దుస్థితి. రోడ్డుపై వెళ్లేందుకు ఏ మాత్రం అవకాశం లేకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీరాజ్‌ నుంచి ఏడేళ్ల కిందట ఈ మార్గం రహదారులు, భవనాల శాఖకు వచ్చింది. తారు రోడ్డు వేసేందుకు గుత్తేదారులకు అప్పగిస్తే అక్కడక్కడ రోడ్డు వేసి వదిలేయటంతో వర్షాలకు ఆ మార్గం ఇలా మారింది.

కోతకు గురైన మైతాపూర్‌-అయోధ్య మార్గం

కోతకు గురైన రహదారి

జగిత్యాల మండలం మైతాపూర్‌-అయోధ్య మార్గం కోతకు గురైంది. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఉన్న ఈ రహదారి రాకపోకలకు ఏ మాత్రం అనుకూలంగా లేనంత స్థాయిలో దెబ్బతింది. నిర్మల్‌ నుంచి జగిత్యాల వెళ్లే మార్గంలో రాయికల్‌-ఇటిక్యాల ప్రాంతంలో వాగు పొంగటంతో రహదారి పూర్తిగా దెబ్బతింది. ఈ మార్గాన్ని రాష్ట్ర రహదారిగా ప్రకటించాలన్న ప్రతిపాదన సైతం ఉంది. రాయికల్‌-ఇటిక్యాల మధ్యలో వంతెన నిర్మించాలన్న ప్రతిపాదనా నాలుగైదేళ్లుగా కాగితాల్లోనే ఉంది. పలు ప్రాంతాలకు ఈ మార్గం కీలకంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతినటంతో రాకపోకలకు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.

అడుగడుగునా అస్తవ్యస్తం

గుంతల మధ్య రోడ్డులా ఉంది దృశ్యం

సూర్యాపేట పాత జాతీయ రహదారి అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు కురిస్తే ఎక్కడ గుంత ఉందో కూడా గుర్తించటం కష్టంగా మారింది. 365 నంబరు జాతీయ రహదారి నకిరేకల్‌ నుంచి నల్గొండ వరకు, 14వ మైలు రాయి నుంచి నాగార్జునసాగర్‌ వరకు రహదారి ప్రమాదకరంగా ఉంది. నల్గొండ-తిప్పర్తి ఆర్‌అండ్‌బీ రహదారి పలు ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతింది. రెండు నుంచి నాలుగు వరుసలకు రహదారిని విస్తరించేందుకు నిధులు మంజూరైనా ఏడాది కాలంగా పనులు సాగుతుండటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

జాతీయ రహదారి గుంతలమయం

గుంతలమయం

వరంగల్‌ జిల్లా పసరగొండ వద్ద 163వ నంబరు జాతీయ రహదారి దెబ్బతింది. ఒగ్లాపూర్‌, సైలాని బాబా దర్గా ప్రాంతాల్లో కూడా ప్రమాదకరంగా గుంతలు పడ్డాయి. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో అధ్వానంగా ఉంది. గడిచిన డిసెంబరులో రూ.12 కోట్లు మంజూరు కావటంతో కొన్ని ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు నుంచి వర్ధన్నపేట మున్సిపాలిటీ వరకు పనులు చేపట్టలేదు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు, మున్సిపల్‌ అధికారులు మట్టిపోస్తున్నా వర్షాలకు ఫలితం ఉండటం లేదు.

కొత్లాపూర్‌... సంవత్సరాలుగా అంతే

మారని రోడ్లు

సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌ రహదారిని పంచాయతీరాజ్‌ శాఖ వారు దశాబ్దం కిందట మరమ్మతు చేశారు. ప్రస్తుతం అధ్వానంగా మారింది. సుమారుగా 5కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద తారు రోడ్డు వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఖమ్మం జిల్లా వైరా నుంచి జగ్గయ్యపేట వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడ్డాయి. 15 కిలోమీటర్లకుపైగా ఉన్న ఈ మార్గాన్ని ఏడాది కిందట సుమారు రూ.2.5 కోట్లతో బాగు చేశారు. నిధులు చాలినన్ని లేకపోవటంతో మరమ్మతులను పూర్తిగా చేయలేదు. వర్షాకాలంలో మరిన్ని ప్రాంతాల్లో దెబ్బతింది.

ఇదీచూడండి: VENKAIAH NAIDU: 'రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం దేశానికే గర్వకారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.