ETV Bharat / state

తన భార్యను వేధిస్తున్నాడని.. ఓ వ్యక్తిని చంపేశారు - హైదరాబాద్​ తాజా వార్త

తనను పెళ్లి చేసుకోలేదని.. ఓ వివాహితను వేధిస్తున్నాడననే నెపంతో ఓ వ్యక్తిపై దాడి చేసి చంపిన ఘటన సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అల్లాపూర్​లో చోటుచేసుకుంది.

man-death-at-sanath-nagar-in-hyderabad
తన భార్యను వేధిస్తున్నాడని.. ఓ వ్యక్తిని చంపేశారు
author img

By

Published : Jan 18, 2020, 11:43 AM IST

Updated : Jan 18, 2020, 1:37 PM IST

సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అల్లాపూర్​లో తన భార్యను కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని అజయ్​ అనే వ్యక్తిపై నలుగురు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం
నాలుగేళ్ల క్రితం మాదాపూర్​ శ్రీచైతన్య కాలేజీలో అకౌంటెంట్​గా పనిచేస్తున్న అజయ్​కు సనత్​ నగర్​లో ఉండే చిట్టి అనే మహిళ పరిచయమైంది. ఆమెకు లక్ష్మి అనే కూతురు ఉంది. చిట్టీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అజయ్​.. తరువాత లక్ష్మిని తన​కు ఇచ్చి పెళ్లి చేయాలని అడిగాడు... కానీ లక్ష్మి, శ్రీశైలం అనే మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అప్పటి నుంచి లక్ష్మికి, చిట్టికి ఫోన్లు చేసి అజయ్​ వేధిస్తున్నాడని.. ఆగ్రహించిన శ్రీశైలం అతని స్నేహితుడు జయరాం సాయంతో శుక్రవారం రోజున అజయ్​పై దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న అజయ్​ను స్థానికులు చూసి ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు విషయమై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీపీ పురుషోత్తం చెప్పారు.

తన భార్యను వేధిస్తున్నాడని.. ఓ వ్యక్తిని చంపేశారు

ఇవీ చూడండి: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక?

Intro:Tg _ hyd _ 56 _17 _ man _ death _ at _ sanathnagar _ AB _TS10021

raghu _ sanathnagar _ 9490402444

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ లో అక్రమ సంబంధం ఉందనే కారణంతో అజయ్ అనే యువకుడు నీ తీవ్రంగా గాయపరచడం తో స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది

తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అజయ్ మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాల్ నగర్ ఏసిపి పురుషోత్తం యాదవ్ తెలిపారు

అజయ్ మృతిపై ఏసిపి పురుషోత్తం మాట్లాడుతూ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ లో పనిచేస్తున్న అజయ్ అనే వ్యక్తి కూకట్పల్లికి చెందిన మహిళతో పరిచయం ఉందని చిట్టి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని సంవత్సరకాలంగా చిట్టిని వేధిస్తున్నట్లు తెలిపారు
కానీ చిట్టి కూతురు శ్రీశైలం అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని అప్పట్నుంచి అదే చిట్టి అనే మహిళ కి శ్రీశైలం శ్రీశైలం చెల్లికి కూడా ఫోన్ చేసి వేధిస్తున్నట్లు తెలిపారు

దీంతో శ్రీశైలం మొత్తం ఫ్రెండ్స్ జయరామ్ చిట్టి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి అతని పై తీవ్రంగా దాడి చేశారని అతని బలమైన గాయాలు తగలడంతో గాంధీ హాస్పిటల్ కు తరలించినట్లు అయితే చికిత్స పొందుతూ అజయ్ మృతిచెందినట్లు ఏసీపీ తెలిపారు అజయ్
అదే మృతి పై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నట్లు ఏ సి పి తెలిపారు

bite.... బాల్ నగర్ ఏసిపి పురుషోత్తం యాదవ్

Body:......

Conclusion:......
Last Updated : Jan 18, 2020, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.