ETV Bharat / state

అతను నాన్న కాదు.. 'ఉత్తమ అమ్మ' - etv bharat news

కంటేనే అమ్మ అని అంటే ఎలా! అసలు ఆడవారే అమ్మ ఎందుకవ్వాలి? రక్తసంబంధం లేకుండానే మగవాడు ఓ పసిగుడ్డుకు అమ్మ కాకూడదా! ఏదో వింతగా, విచిత్రంగా ఉంది కదూ.. కానీ పుణెకు చెందిన ఆదిత్య తివారీ మాత్రం ఏకంగా 'ఉత్తమ అమ్మ'గా గుర్తింపు దక్కించుకున్నారు.

man-becoming-as-best-mother-story
అతను నాన్న కాదు.. 'ఉత్తమ అమ్మ'
author img

By

Published : Mar 7, 2020, 5:48 PM IST

పుణెకు చెందిన ఆదిత్య తివారీ 2016లో 22నెలల వయసున్న బాబును దత్తత తీసుకున్నాడు. అప్పటికే ఆ చిన్నారికి కొన్ని జన్యుపరమైన సమస్యలున్నాయి. ప్రస్తుతం ఆరేళ్లున్న ఆ పసివాడిని అల్లారుముద్దుగా, కంటికి రెప్పలా పెంచారు తివారీ. తాను చేస్తున్న సాఫ్ట్​వేర్ ఉద్యోగాన్నీ వదిలేశారు. ఈయన త్యాగానికి గుర్తింపు దక్కింది. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి 8న బెంగళూరులో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈయన 'ఉత్తమ అమ్మ'గా గౌరవం పొందనున్నారు.

జనవరి 1, 2016లో తివారీ 22నెలల వయసున్న బాబును దత్తత తీసుకున్నారు. అన్విష్ అని పేరు పెట్టారు. బాలుడి రాకతో తివారీ జీవితం కొత్త మలుపులు తిరిగింది. సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలేసి అన్విష్ లాంటి ప్రత్యేక అవసరాలుగల పిల్లల తల్లిదండ్రులకు సహాయం చేయడానికి తివారీ కౌన్సెలర్​గా మారారు.

తివారీ అన్విష్​తో కలిసి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో సమావేశాలు, వర్క్​షాపులు నిర్వహించారు. ఇలా దాదాపు 400 ప్రాంతాల్లో తివారీ మాట్లాడారు. 10వేల మంది తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసేలా రూపొందించిన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈయనకు ఐక్యరాజ్యసమితి నుంచీ, 'వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్' జెనీవా నుంచీ ఆహ్వానం అందింది.

'అన్విష్ వల్ల నాకు కొన్ని విషయాలు తెలిశాయి. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకోసం మనదేశంలో ప్రత్యేక కేటగిరీ లేదు. వారికి ప్రభుత్వం వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలేదు. నేను ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాను. అందుకే ఆన్​లైన్​లో పిటిషన్ వేశాను. దీని ఫలితంగా ప్రభుత్వం స్పందించి అన్విష్​లాంటి వారికోసం ప్రత్యేక కేటగిరీని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం వారు ధ్రువీకరణ పత్రాలు పొందడానికీ వీలవుతోంది' అంటున్నారు తివారీ.

'అన్విష్​కు ఉన్న వైకల్యానికి తోడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తేలింది. కానీ తర్వాతర్వాత వాటంతట అవే పూడిపోయాయి. అయినప్పటికీ అన్విష్ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. 2 శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి ఉంది. అని తివారీ చెబుతున్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రస్తుతం మరో కౌన్సెలింగ్ సదస్సును ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇప్పటికైతే వీరు ఓరియన్ మాల్ బ్రిడ్డిగేట్​వే, మల్లేశ్వరం (బెంగళూరు)లో మహిళా దినోత్సవం రోజు జరగనున్న కార్యక్రమానికి హాజరయ్యే పనుల్లో ఉన్నారు.

ఇవీ చదవండి.. జైలుకెళ్లాలన్న 'వందేళ్ల బామ్మ' కల పుట్టినరోజున తీరింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.