IT Enquiry on Minister Mallareddy Assets :మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో మల్లారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు, విద్యా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత 16మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ బషీర్‌బాగ్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు.
ఈ మేరకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు... ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలకు చెందిన డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మొత్తం 13మంది విచారణకు హాజరయ్యారు. మంత్రి మల్లారెడ్డి సోదుడు గోపాల్ రెడ్డిని సైతం ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ అధికారులు 48గంటలపాటు మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఇళ్లలో సోదాలు నిర్వహించిన సమయంలో కీలక డాక్యుమెంట్లు, లాప్‌టాప్‌లు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు.
వాటిని విశ్లేషించిన ఐటీ అధికారులు.. అందులోని సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఆదాయపుపన్ను చెల్లింపు... టర్నోవర్‌లో వ్యత్యాసాలు ఉన్నట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించిన అధికారులు అందులోని లోటుపాట్లను తేల్చే పనిలో ఉన్నారు.
ఇవీ చూడండి: