ETV Bharat / state

యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామా..! - తెలంగాణ వార్తలు

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

malladi-krishna-rao-resigns-to-yanam-legislative-assembly
యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామా..!
author img

By

Published : Feb 15, 2021, 10:23 PM IST

యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి అధికారిక కార్యక్రమాలకు మల్లాడి దూరంగానే ఉన్నారు. యానాం ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఇటీవల రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాన్ని కూడా సమర్పించారు.

యానాం రాజకీయాలలో సంచలనం..

1996 నుంచి 2016 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో యానాం నియోజకవర్గం నుంచి మల్లాడి కృష్ణారావు ఓటమి ఎరుగని నాయకుడిగా విజయం సాధిస్తూ వచ్చారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా యానాం సమస్యల పరిష్కారం కోసం అటు కేంద్ర, రాష్ట్ర నాయకులతో సఖ్యతగా మెలగడం ద్వారా పనులు పూర్తి చేయించడంలో ఆయనది అందెవేసిన చేయి.

ఇదీ చదవండి: భాజపా నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.