ETV Bharat / state

దయనీయస్థితిలో సీఎం దత్తత గ్రామాలు: రేవంత్​రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్​ తీరుపై మరోసారి మండిపడ్డారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి. సీఎం తీసుకున్న గ్రామాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారంటే... ఆ గ్రామం మిగతా గ్రామాలకు రోల్ మోడల్‌గా ఉండాలన్నారు.

revanth reddy
దయనీయస్థితిలో సీఎం దత్తత గ్రామాలు: రేవంత్​రెడ్డి
author img

By

Published : Dec 23, 2020, 7:20 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ దత్తత తీసుకున్న గ్రామాలు దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. మేడ్చల్​ జిల్లా లక్ష్మాపూర్​.. మూడు చింతల పల్లి... కేశవరం... గ్రామాలను కేసీఆర్​ మూడేళ్ల క్రితం దత్తత తీసుకున్నారని గుర్తు చేశారు. అక్కడ అభివృద్ధి మాత్రం మిగతా గ్రామాల కంటే గొప్పగా ఏమిలేదని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో తెలిపారు.

స్వయంగా సీఎం దత్తత తీసుకున్న లక్ష్మాపూర్‌ గ్రామంలోనే రైతులకు మూడు దఫాలుగా రైతుబంధు రాలేదని పేర్కొన్నారు. గతంలో దత్తత తీసుకున్న గ్రామాల్లోనే అభివృద్ది పడకేసిందని... తాజాగా సీఎం వాసాలమర్రి అనే మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారంటే ఆ గ్రామం మిగతా గ్రామాలకు రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామాలు మీ పరిధిలో ఉన్నందున ఇప్పటికైనా గ్రామాల అభివృద్దిపై దృష్టి పెట్టాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌నుద్దేశించి లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.