రాష్ట్ర సరిహద్దుల్లో సంక్షోభాన్ని నివారించడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం నుంచి వెళ్లేందుకు ఎన్వోసీ ఇవ్వడం వల్ల పెద్దఎత్తున జనాలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. తిరిగి వారిని రాష్ట్ర సరిహద్దులో అడ్డుకోవడం సరికాదన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు... సమయస్ఫూర్తి ప్రదర్శించడం అవసరమని విమర్శించారు. తక్షణమే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్