ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పోస్టుల్లో.. మాల, అనుబంధ ఉపకులాల వారికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాల అనుబంధ కులాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. మాల కులస్థులు.. సమాజంలో ఎంతో వెనుకబడి ఉన్నాయని సమాఖ్య స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్యామ్ మనోహర్ గుర్తు చేశారు. నియామకాల ప్రోత్సాహంతో తోడ్పాటునందించాలని కోరారు. హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో బెస్తలు తక్కువగా ఉన్నందున.. మరో కులానికి చేపల పెంపకంతో పాటు గొర్రెల పెంపకంలోనూ అనుమతి కల్పించాలని.. శ్యామ్ మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఏళ్ల తరబడి.. కాటి కాపరులుగా సేవలందిస్తున్న మాలలు ఎలాంటి అవకాశాలకు నోచుకోవడం లేదని వివరించారు. ఎక్కువ అవకాశాలు మాలలే పొందారన్న దళిత సోదరుల మాటల్లో వాస్తవం లేదన్నారు. ఈ సమావేశంలో సమాఖ్య స్టీరింగ్ కమిటీ సభ్యులు.. పట్టా వెంకటేశ్వర్లు, బత్తుల రాంప్రసాద్, చెరుకు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది?