ETV Bharat / state

'పరిశుభ్రత కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయండి' - indian red cross society Latest News

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో పరిశుభ్రత పెంపొందించాలని విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించారు గవర్నర్ తమిళిసై. ఈ మేరకు వర్సిటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

'పరిశుభ్రత కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయండి'

author img

By

Published : Jun 8, 2020, 9:24 PM IST

కొవిడ్-19 నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల వసతి గృహాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌ నుంచి దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం డీన్ డా. ఎస్‌టీ వీరోజీరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పీపీఈ కిట్లు సమకూర్చాలి..

కరోనా మహమ్మారి కట్టడి చేసే తరుణంలో వ్యక్తిగత రక్షణ కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పశు వైద్య శాస్త్ర కళాశాలలు, పాల సాంకేతిక పరిజ్ఞానం, మత్స్య సంపద, విద్యా, బోధన, విస్తరణ, పరిశోధన, పరిపరిపాలనా కార్యకలాపాల అమలు, ఆర్థిక స్థితి తీరు వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

చర్యల గురించి ఆరా..

భారీ ప్రాజెక్టులు, పరిశ్రమ, మార్కెట్ అవసరాలను తీర్చడానికి సిలబస్, కోర్సుల్లో నాణ్యత పెంచడానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఆచార్యులు అభివృద్ధి చేసిన సాంకేతికత పరిజ్ఞానం, పొడిగింపు కార్యకలాపాలు, కౌన్సెలింగ్, ఇ- లైబ్రరీ సౌకర్యం మొదలైన అంశాలు అడిగి తెలుసుకున్నారు.

ఆన్​లైన్ పరీక్షలపై తర్ఫీదునివ్వాలి..

కరోనా దృష్ట్యా.. ఆన్‌లైన్ తరగతులు, ఆన్‌లైన్ అంతర్గత అంచనా, ఆన్‌లైన్ వివా- వోస్, ఆన్‌లైన్ పరీక్షలు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ పరీక్షల పద్ధతిని విద్యార్థులకు తెలియజేయడం సహా అన్ని కళాశాలలను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ గర్వించదగిన భాగస్వాములుగా తీర్చిదిద్దాలన్నారు.

పరిశ్రమల సహకారం..

పరిశ్రమల సహకారంతో వినూత్న, ఉద్యోగ ఆధారిత పాలిటెక్నిక్ కోర్సులు జోడించడం ద్వారా పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. డా. బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రశంసలు జల్లు కురిపించిన గవర్నర్‌.. జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో వర్సిటీకి మంచి ర్యాంకు వచ్చేలా కృషి చేయాలని అధ్యాపకులకు, సిబ్బందికి సూచించారు.

ఇవీ చూడండి : 'విద్యుత్ బిల్లులు ఎక్కువేం రాలేదు.. వినియోగమే పెరిగింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.