హైదరాబాద్‌లోని మజ్లిస్ ఎమ్మెల్యేలు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను బీఆర్కే భవన్లో కలిశారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు పెంచాలని, తమ నియోజకవర్గాల పరిధిలో పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరారు. మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఏడు నియోజకవర్గాల్లో కొత్తగా కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల జాబితాను ఈటలకు అందించారు.
ప్రస్తుతం భాగ్యనగర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలను, కేంద్రాల్లో వసతులను పెంచాలని మంత్రిని కోరారు. ప్రతి కేంద్రం వద్ద రోజుకు వేయి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని విజ్ఞప్తి చేశారు.