ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీలు

విమర్శలూ... ప్రతివిమర్శలు. ఎత్తులకు పైఎత్తులు. వ్యూహాలు... ప్రతివ్యూహాలు. గ్రేటర్‌ పోరులో పైచేయి సాధించేందుకు ఇవే పార్టీలు సంధిస్తున్న అస్త్రాలు. నామపత్రాల దశ నుంచి ప్రచార ఘట్టానికి చేరటంతో... పోరు మరింత వేడెక్కింది. నామపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన అభ్యర్థులు... రథాలెక్కి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బల్దియా పీఠమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోరుసాగిస్తున్నాయి.

main party leaders campaign in ghmc elections
జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీలు
author img

By

Published : Nov 21, 2020, 10:01 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీలు

పంతం నీదా నాదా.... పీఠం నీకా నాకా.... గల్లిగల్లికీ... వీధివీధికి... యుద్దం సై.... గెలిచేదెవరో... ఓడేదెవరో....సిద్ధం సై...వేద్దాం సై... చూద్దాం సై... అంటూ బల్దియా పోరులో తేల్చుకునేందుకు రాజకీయ పార్టీలు కదనరంగంలోకి దుకాయి. అభ్యర్థిత్వాలు, నామపత్రాల ఘట్టం పూర్తవటంతో అస్త్రశస్త్రాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ప్రధాన పార్టీలు.... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమదైన అస్త్రాలతో ప్రచారం సాగిస్తున్నాయి. అభివృద్ధే ప్రధాన ఎజెండగా అధికార పార్టీ ముందుకు సాగుతుండగా... ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు దృష్టి సారిస్తూ... ఓట్లు అడుగుతున్నాయి.

ప్రచారంలో ముందున్న తెరాస

గ్రేటర్‌ ఎన్నికల్లో మొదటి నుంచి అందరికంటే ఒకడుగు ముందున్న అధికార పార్టీ... ప్రచారంలోనూ జోరును కొనసాగిస్తోంది. నెలల తరబడిగా గులాబీ శ్రేణులను సన్నద్ధం చేయటం మొదలు.. ప్రచారంలో అంతిమంగా జరిగే అధినేత సభ వరకు చేపట్టాల్సిన ప్రతీ కార్యక్రమాన్నీ వ్యూహాత్మకంగా అమలుచేసేలా... ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యేక రాష్ట్రంలో బల్దియాకు మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో ఏకపక్షంగా 99 సీట్లను సాధించి... గులాబీ జెండాను ఎగురవేసిన తెరాస... ఈ సారి దానిని మించిన ఫలితాన్ని రాబట్టేలా వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా... దాదాపుగా సిట్టింగ్‌లకే అభ్యర్థిత్వం ఖరారు చేసి... ముందుగానే వారిని ప్రజాక్షేత్రంలోకి దించింది. సార్వత్రిక, ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో భాజపా వరుసగా విజయాలు సాధిస్తుండటం పట్ల... కమలం ఉత్సాహాన్ని కట్టడికి చేసేందుకు బల్దియా పోరును సరైన వేదికగా భావిస్తోంది.

ఈ నెల 28న ఎల్బీస్టేడియంలో తెరాస అధినేత సభ

శుక్రవారంతో అభ్యర్థిత్వాలు, నామపత్రాల దాఖలు పూర్తైనందున.... పార్టీ నుంచి బరిలోకి దిగిన వారంతా క్షేత్రస్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు. 11 మంది మంత్రులు సహా... పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లతోపాటు నగర శివారులోని మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లను డివిజన్లవారీగా ఇంఛార్జిలుగా నియమించింది. వీరంతా.. ఆయా ప్రాంతాల్లో శ్రేణులను సమన్వయం చేయడంతో పాటు సమావేశాలతో అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పలుచోట్ల టికెట్‌ రాక అలకబూనిన వారిని బుజ్జగిస్తూ... పార్టీ గెలుపు కోసం అధినేత మార్గదర్శకాలను అమలుచేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ … ప్రచారం ప్రారంభించారు. ప్రగతి నివేదన రూపంలో ఇప్పటికే నగర అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న నేతలు... ఇదే అంశాన్ని ప్రచారంలోనూ ఉపయోగించుకుంటున్నారు. భాజపా విధానాలను, విపత్తువేళ రాష్ట్రం పట్ల కేంద్రం మొండిచేయి, తదితర అంశాలపై తెరాస ప్రధానంగా ఉపయోగించుకుంటోంది. ఈ నెల 28న ఎల్బీస్టేడియంలో తెరాస అధినేత కేసీఆర్ గ్రేటర్‌ ఎన్నికలపై జరిగే బహిరంగసభకు హాజరుకానున్నారు.

వరుస విజయాలతో ఊపుమీదున్న కమలం పార్టీ

ఇక తెరాసకు ప్రత్యామ్నాయం తామేనంటూ.... వరుస విజయాలతో ఊపుమీదున్న కమలం పార్టీ.... గ్రేటర్‌ ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం చివరిదాకా వేచిచూసే ధోరణిని ప్రదర్శించిన భాజపా... ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పలువురిని తమవైపు తిప్పుకోవటంలో సఫలీకృతమైంది. అభ్యర్థులే కాకుండా నగరంలోని బలమైన నేతలతోనూ మంతనాలు సాగిస్తూ... కాషాయకండువా కప్పేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఇప్పటికే కమలదళంలో చేరగా... మరికొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. నామపత్రాల దాఖలు ముగిసినందున... ప్రచారంలో కారు జోరుకు తగ్గకుండా ముందుకు సాగుతున్న కమలం... పలువురు జాతీయ నేతలను సైతం రంగంలోకి దింపనుంది. ఇప్పటికే బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డి.కె.అరుణ ప్రచారం సాగిస్తుండగా... కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి రానున్నారు.

వెనకబడిన కాంగ్రెస్​

నాయకత్వలోపం, వరుస వలసలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌.... గ్రేటర్‌ ఎన్నికల్లో ఆది నుంచి గడ్డుపరిస్థితులనే ఎదుర్కొంటోంది. బల్దియా తొలినాళ్లలో మేయర్‌ పదవిని కైవసం చేసుకున్న ఆ పార్టీకి.... ప్రస్తుతం బలమైన అభ్యర్థులను పోటీకి దించలేని స్థితికి దిగజారింది. రాష్ట్ర నాయకుల తీరుతో పలువురు ఇప్పటికే ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లగా... ఈ ఎన్నికల్లో 30కి పైగా డివిజన్లలో అభ్యర్థులే కరువయ్యారు. నామినేషన్ల దాఖలు గడువు ముగిసినందున... అన్ని పార్టీలు ప్రచారాన్ని షురూ చేసినా.... కాంగ్రెస్‌ జెండా ఇంకా కనిపించటంలేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తదితరులు మాత్రమే అక్కడక్కడ అభ్యర్థులతో కలిసి ప్రచారాలు చేస్తున్నారు. పార్టీని వీడుతున్న సీనియర్లతో చర్చలు జరిపేందుకే పార్టీ నాయకత్వం తిరుగుతోంది.

గెలుపే లక్ష్యంగా మజ్లిస్‌ ప్రచారం

బల్దియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మజ్లిస్‌ రంగంలోకి దిగింది. తొలుత 44 సిట్టింగ్‌ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టాలనుకున్న ఆ పార్టీ... రాత్రికి రాత్రే వ్యూహాన్ని మార్చేసింది. యాభైకి పైగా అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. పాతబస్తీతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ఎంఐఎం తరఫున నామినేషన్లు వేయించింది. సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరు, వారి వయసును పరిగణనలోకి తీసుకుని ఐదుగురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించిన ఆ పార్టీ... కొందరిని ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో కాకుండా వేరే చోట్ల అభ్యర్థులుగా నిలిపారు. కాంగ్రెస్, భాజపా బలంగా ఉన్న స్థానాల్లో దీటైన అభ్యర్థులను బరిలోకి దింపారు. కాగా... నామినేషన్ల ప్రక్రియకు ముందే మజ్లిస్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్‌, పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరుగుతున్నారు.

ఇదీ చదవండి: 'ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషార్ హైదరాబాద్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.