సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతి రావు ఫూలే, అంబేడ్కర్ జయంతి వారోత్సవాలను పురస్కరించుకుని ఉస్మానియా విద్యార్థులు... ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో భీమ్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. బౌద్ధదామం ప్రచారకులు తోకల సంజీవ్ విద్యార్థుల చేత భీమ్ ప్రతిజ్ఞ చేయించారు.
ఫూలే జయంతి అయిన ఏప్రిల్ 11 నుంచి అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 వరకు భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంబేడ్కర్ హిందూ మతం వీడి బౌద్ధ మతం స్వీకరించిన సమయంలో.. 22 ప్రమాణాలు చేశాడని, అవే ప్రమాణాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో కూడిన సమసమాజ నిర్మాణం కోసం పాటుపడతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సన్‌రైజర్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం