ETV Bharat / state

మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం - FESTIVAL TALASANI SRINIVAS

లష్కర్‌ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ నెల 21, 22వ తేదీల్లో జరగనున్న సంబురాలు అంబరాన్ని అంటేలా సర్కారు సన్నాహాలు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం
author img

By

Published : Jul 4, 2019, 5:03 AM IST

Updated : Jul 4, 2019, 8:41 AM IST

మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బోనాల ఉత్సవాల విశిష్టతను చాటి చెప్పే విధంగా సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున్న హాజరయ్యే అవకాశమున్నందున నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బోనాలు సమర్పించడానికి రెండు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

గతేడాది అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ట్రాన్స్‌కో, పోలీస్‌, దేవాదాయ, అగ్నిమాపక శాఖల అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రోడ్లపై వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, మురుగునీరు పారకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా చూడాలని తలసాని కోరారు. బోనాల పండుగ కోసం సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని మహంకాళి పోలీసులు సమీక్షించనున్నారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలకు జీహెచ్​ఎంసీ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ దాన కిశోర్ తెలిపారు.

ఇవీ చూడండి: "ప్రవేశాలలోపు రుసుములు ఖరారు చెయ్యండి"

sample description
Last Updated : Jul 4, 2019, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.