ETV Bharat / state

సుప్రీంకోర్టు సూచనలు అమలు చేయాలని.. మాదిగ ఐకాస ధర్నా!

మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు చేసిన సూచనలను అమలు చేయాలని హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​పై గల అంబేడ్కర్ విగ్రహం ముందు మాదిగ ఐకాస ధర్నా నిర్వహించింది. తక్షణమే ఎస్సీ రిజర్వేషన్​లపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని ఐకాస నాయకుడు పిడమర్తి రవి డిమాండ్ చేశారు.

Madiga JAc Demands For Apply Supreme Court Suggestions
సుప్రీంకోర్టు సూచనలు అమలు చేయాలని.. మాదిగ ఐకాస ధర్నా!
author img

By

Published : Sep 25, 2020, 4:03 PM IST

మాదిగల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను వెంటనే అమలు చేయాలని.. మాదిగల రిజర్వేషన్​ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మాదిగ ఐకాస హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​పై గల అంబేడ్కర్​ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. తక్షణమే ఎస్సీ రిజర్వేషన్​ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని ఐకాస నాయకులు పిడమర్తి రవి డిమాండ్​ చేశారు. లేని యెడల దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామన్నారు.

జనాభా ప్రకారం తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పినట్లు ఏబీసీడీ వర్గీకరణ అవసరం లేదని... మాదిగలకు న్యాయం జరగాలంటే 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: మా అబ్బాయిని పొట్టనపెట్టుకున్నారు: హేమంత్ తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.