ఎస్సీల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని మాదిగ సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ అభివృద్ధికి పాటు పడుతున్న సీఎంకు త్వరలోనే గుడి నిర్మిస్తామని తెలిపారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలుపరుస్తున్నారని పిడమర్తి రవి తెలిపారు. ఆయన రుణం తీర్చుకోవడానికి త్వరలోనే సీఎంకు గుడి కడతామని చెప్పారు. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గం పరిధిలో 100 ఎస్సీ కుటుంబాలకు 10 లక్షల చొప్పున కేటాయించడం ద్వారా ఒక బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అన్నారు. రూ.12 వందల కోట్లతో "దళిత సాధికారత పథకం" ప్రారంభించిన రోజునే గుడి నిర్మాణాన్ని మొదలుపెడతామని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుబంధు తరహాలో రుణాలు ఇవ్వడంపై రవి హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు సబ్ కమిటీ ఆమోదం