మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ మెడికల్ కళాశాలలో డాక్టర్ సత్యేంద్ర మిశ్రా పల్మనాలజీ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ఏడాది కాలంగా వందల మంది కొవిడ్ బాధితులకు చికిత్స చేసి కాపాడారు. ఈ క్రమంలో గత నెలలో వైరస్ బారినపడ్డారు. స్థానికంగా చికిత్స అందించినా కోలుకోలేకపోయారు.
ఆయన సహచరులు వేడుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఎయిర్ అంబులెన్స్ సికింద్రాబాద్ యశోదకు పంపారు. అప్పటికే ఆయన ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో ఊపిరితిత్తుల మార్పిడి అవసరం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి వైద్య నిపుణులు.. ఆయన్ను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. ఎక్మో మీదకు వెళ్లకుండానే ఆయన ఆరోగ్యం మెరుగయింది. శుక్రవారం ఆయనను డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి డైరక్టర్ డా.పవన్ గోరుకంటి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కరోనా బారిన పడిన మధ్యప్రదేశ్ డాక్టర్... హైదరాబాద్‌కు తరలింపు