ETV Bharat / state

Maareddy on Paddy: "కేంద్ర నుంచి లేఖ తీసుకురండి.. తడిసిన ధాన్యం కూడా కొంటాం"

Maareddy on Paddy: ధాన్యం కొనుగోళ్లపై భాజపా, కాంగ్రెస్​లు దుష్ప్రచారం చేస్తున్నాయని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మొలకెత్తిన ధాన్యం సేకరించడానికి కేంద్రం నుంచి అనుమతి ఇప్పించాలని భాజపా నేతలను కోరారు. రైతుల పట్ల సీఎం అత్యంత సానుకూలంగా ఆలోచిస్తున్నారని తెలిపారు.

Maareddy srinivas reddy
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి
author img

By

Published : Dec 9, 2021, 5:27 PM IST

Maareddy on Paddy: కేంద్రం, ఎఫ్‌సీఐ మార్గదర్శకాల ప్రకారమే నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ఎలా కొంటామని.. ఎఫ్​సీఐ నిబంధనల ప్రకారమే పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్​ ఎర్రమంజిల్​లోని పౌరసరఫరాల భవన్‌లో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్స భాజపాలది దుష్ప్రచారం

రాష్ట్రంలో ధాన్యం కొనడం లేదని భాజపా, కాంగ్రెస్​లు దుష్ప్రచారం చేస్తున్నాయని మారెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. దశాబ్దాల కాలం నుంచి కొనుగోలు వ్యవస్థ కొనసాగుతోందని తెలిపారు.

కేంద్రం నుంచి లేఖ ఇప్పిస్తే కొంటాం

maareddy on BJP leaders: తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం సేకరించడానికి కేంద్రం నుంచి అనుమతి ఇప్పించాలని భాజపా నేతలను మారెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. కేంద్రం నుంచి లేఖ ఇప్పిస్తే వాటిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రైతులు నష్టపోవాలని ఏ ప్రభుత్వం కోరుకోదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని కొనియాడారు. రైతుల పట్ల సీఎం అత్యంత సానుకూలంగా ఆలోచిస్తున్నారని తెలిపారు. గత వానాకాలంతో పోల్చితే ఈసారి అదనంగా 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొంటున్నామని స్పష్టం చేశారు. గతేడాది వానాకాలం, రబీలో భాజపా, కాంగ్రెస్ నాయకులు చెబితేనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందా అని మారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

కొనుగోళ్లలో మూడోస్థానం

Maareddy on FCI rules: దేశంలో ఏడేళ్ల కాలంలో ధాన్యం కొనుగోళ్లల్లో పంజాబ్, హర్యానా తర్వాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. కేంద్రం, ఎఫ్‌సీఐ నిబంధనల కారణంగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ ఆలస్యమతోందని తెలిపారు. లేకపోతే ఎప్పుడో పూర్తయ్యేదని మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఎంపీలు పార్లమెంట్​లో పోరాడితే భాజపా, కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇవ్వలేదు. ఇవాళ మిల్లర్లు ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వ్యాగన్ల మూమెంట్ పెంచండి. ఎఫ్​సీఐ వద్ద ఇప్పటికే 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా ఉంది. దానికే గోదాములు దిక్కులేవు. వేలసంఖ్యలో లారీలు ప్రతి జిల్లాలోని ఎఫ్​సీఐ గోడౌన్ల వద్ద ఉన్నాయి. దయచేసి మీరు గోడౌన్ స్పేస్ కల్పించండి. రైస్ మిల్లర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా మీకు తెలిస్తే మాకు సమాచారమివ్వండి. ఇప్పటికైనా భాజపా ఎంపీలు కేంద్రమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఎవరూ కూడా రైతులకు నష్టం కలిగించాలని కోరుకోరు. రైతులు ఇబ్బందులకు గురి కాకుండా అందరు కృషి చేయాలి. - మారెడ్డి శ్రీనివాసరెడ్డి

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి

ఇదీ చూడండి:

Maareddy: అంచనాలకు మించి ధాన్యం దిగుబడి : మారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.