రాష్ట్రంలో 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌కు 20 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 111 జీవో పరిధిలోని గ్రామాల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నా.. దరఖాస్తులు రావడం గమనార్హం. ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో ఆయా గ్రామాల పేర్లు అందుబాటులో ఉండకూడదు. కానీ, సాంకేతిక లోపంతో ఈ 84 గ్రామాల పేర్లు కూడా వెబ్‌సైట్‌లో ఉండటంతో దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.
జీవో 131లో నిబంధనలు స్పష్టంగా ఉన్నందున.. సదరు దరఖాస్తులను తిరస్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు గురువారంతో ముగియనుంది. సెప్టెంబరు 31నుంచి బుధవారం వరకూ ఎల్‌ఆర్‌ఎస్ కోసం 16,28,844 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క బుధవారమే 2.16 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.
రాష్ట్రంలో భారీ వర్షాలతో నెట్‌వర్క్ సమస్యలు, ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో అంతరాయాల నేపథ్యంలో గడువు పెంచాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై గురువారం నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
సహాయక చర్యలు ముమ్మరం చేయాలి: అర్వింద్‌కుమార్
వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశించారు. సీడీఎంఏ కార్యాలయంలో పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఇవీచూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం