నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయి ఫణీంద్ర, తేజశ్రీ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ అగ్రకులానికి చెందిన వారే. అంతేకాక యువకుడు వృత్తిరీత్యా విదేశాల్లో స్థిరపడగా... యువతి హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తోంది. కానీ వారి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. చేసేది లేక చివరకు ఆర్య సమాజంలో కొంతమంది సన్నిహితులు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం తమ రక్షణ కోసం కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణను ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చి పంపించారు.
ఇదీ చదవండి: కసరత్తు షురూ..: కొత్త సంవత్సరంలో టీపీసీసీకి నూతన సారథి