ETV Bharat / state

బండ్లగూడ, పోచారంలో మిగిలిపోయిన ఫ్లాట్లకు మార్చి 3న లాటరీ - హైదరాబాద్ తాజా వార్తలు

Rajiv Swagruha Flats: హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రీబుల్ బెడ్​ రూమ్ 3 బీహెచ్​కే ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3న లాటరీ నిర్వహించనున్నట్లు హెచ్​ఎమ్​డీఏ తెలిపింది. మరోవైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో హచ్​​ఎమ్​డీఏ లేఔట్​లో సోమవారం ప్రీ బిడ్ సమావేశం జరిగింది. మేడిపల్లి లేఔట్​లో హెచ్ఎమ్​డీఏ 300 చదరపు గజాలు గల 50 ఫ్లాట్​లను రూపొందించింది.

Rajiv Swagruha Flats
Rajiv Swagruha Flats
author img

By

Published : Feb 20, 2023, 8:26 PM IST

Rajiv Swagruha Flats: హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను ఇటీవల హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. రాజీవ్ స్వగృహ కార్పోరేషన్​కు సంబంధించి బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రీబుల్ బెడ్ రూమ్ 3 బీహెచ్​కే, డబుల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్ ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3వ తేదీన లాటరీ నిర్వహిస్తున్నట్లు హెచ్​ఎమ్​డీఏ తెలిపింది.

ఫిబ్రవరి 15వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్​గా 3 బీహెచ్​కే కోసం రూ.3 లక్షలు, 2 బీహెచ్​కే కోసం రూ.2 లక్షలు, 1 బీహెచ్​కే కోసం రూ.1 లక్ష చొప్పున డిమాండ్ డ్రాఫ్టులు కట్టిన వారు లాటరీకి అర్హులుగా ప్రకటించారు. మార్చి 3వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే లాటరీని పారదర్శకంగా దరఖాస్తుదారులు ఆన్​లైన్​లో ప్రత్యక్షంగా యూట్యూబ్, ఫేస్​బుక్​ల ద్వారా తిలకించవచ్చన్నారు.

మరోవైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పరిధిలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ (హెచ్​ఎమ్​డీఏ) లేఔట్​లో సోమవారం ప్రీ బిడ్ సమావేశం జరిగింది. మేడిపల్లి లేఔట్​లో హెచ్ఎమ్​డీఏ 300 చదరపు గజాలు గల 50 ఫ్లాట్​లను రూపొందించింది.

ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎమ్​డీఏ) నిర్వహించిన ల్యాండ్ పార్సల్ ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియకు ఆదరణ లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 9 ల్యాండ్ పార్సెల్‌ను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించారు. ఈ విక్రయాల ద్వారా 195.24 కోట్ల ఆదాయం వచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

స్థిరాస్తి వ్యాపారస్తులు ల్యాండ్ పార్సెల్ కొనుగోలుకు ఆసక్తి కనబరచడంతో అత్యధికంగా గజం రూ. లక్షా 11 వేలు ధర పలికింది. రెండో దశ ల్యాండ్ పార్సిల్స్ అమ్మకాలకు మరో మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హెచ్ఎమ్​డీఏ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.