అత్యధికంగా వరంగల్:
రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలోని 2, 216 మద్యం షాపులకు అర్ధరాత్రి వరకు వచ్చిన 48, 385 దరఖాస్తులను పది ఉమ్మడి జిల్లాల్లోని ఎక్సైజ్ డివిజన్ల వారీగా పరిశీలించినట్లయితే అత్యధికంగా వరంగల్ డివిజన్‌లో 7 వేల 864, ఖమ్మం 7 వేల 271, నల్గొండ 7 వేల 49, రంగారెడ్డి డివిజన్‌లో 7, 126 లెక్కన వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడించింది. తక్కువ దరఖాస్తులు వచ్చిన డివిజన్లలో హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్‌లు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 2017లో 41 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినందున లక్ష రుసుం కింద మొత్తం రూ.411 కోట్లు రాబడి వచ్చింది. అయితే ఈసారి దరఖాస్తు రుసుం రెండు లక్షలకు పెంచడం వల్ల ప్రభుత్వానికి రెట్టింపునకు మించి రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాపారుల పోటీ:
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలను అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందువల్ల లిక్కర్ వ్యాపారంలో ఉన్నవారు ప్రత్యేకించి తెలంగాణ సరిహద్దు జిల్లాలోని మద్యం షాపులను దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష