డప్పుల దరువులు... యువత నృత్యాల మధ్య... జై బోలో గణపతి బొప్పా మోరియా అంటూ... ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. అందంగా అలంకరించిన వాహనాల్లో శోభాయమానంగా వినాయకులను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి... భక్తులు తీసుకొస్తున్నారు.
గతంలో పెద్ద పెద్ద విగ్రహాలతో భారీ ఊరేగింపుతో వచ్చేవారు. ఈసారి కొవిడ్ నేపథ్యంలో చిన్న చిన్న విగ్రహాలను... అందంగా ముస్తాబు చేసి నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పోలీసులు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించకుండా కొందరు చిన్న పిల్లలను సైతం తీసుకుని రావడం విస్మయానికి గురిచేస్తోంది.
ఇదీ చూడండి: అమ్మాయిల వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం