ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేరళలో జగ్గుస్వామి అందుబాటులో లేకపోవడంతో నిన్న జగ్గుస్వామికి లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, తుషార్, జగ్గుస్వామిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణకు సహకరించాలని బీఎల్ సంతోశ్‌కు హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు నిన్న శ్రీనివాస్‌ను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. సింహయాజీతో ఉన్న సంబంధాలపై సేకరించిన ఆధారాలను ముందు పెట్టుకొని మరీ ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఫామ్‌హౌస్‌లో జరిగిన సంప్రదింపులపై తనకు ఏమాత్రం అవగాహన లేదని శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నందకుమార్తోనూ శ్రీనివాస్‌కు సత్సంబంధాలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే న్యాయవాది శ్రీనివాస్ నేడు మరోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. సిట్ అధికారులు అడిగిన వివరాలతో విచారణకు హాజరయ్యారు.
ఇవీ చూడండి..
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగిసిన మొదటిరోజు విచారణ..
'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సిట్ విచారణ కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు